ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (10:06 IST)

పెళ్లికాకుండానే తండ్రికాబోతున్న భారత క్రికెటర్!!

భారత క్రికెట్ జట్టుకు చెందిన సభ్యుల్లో హార్దిక్ పాండ్యా ఒకరు. జట్టుకు లభించిన అరుదైన ఆల్‌రౌండర్. ఈ యువ క్రికెటర్ అమ్మాయిల హృదయాలను దోచుకోవడంలోనూ ఆల్‌రౌండరే. ఫలితంగా పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తండ్రికాబోతున్నాడు. తన ప్రియురాలితో చేసిన డేటింగ్ పుణ్యమాని ఇపుడు తండ్రికాబోతున్నాడు. 
 
నిజానికి హార్దిక్ పాండ్యా.. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేనిది. అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తో రాణిస్తూ, జట్టులో ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో ఈ యేడాది జనవరి ఒకటో తేదీన తన ప్రియురాలు నటాషాను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు. అలాంటి హార్దిక్.. ఇపుడు మరో షాకిచ్చాడు. బ్యాచిలర్‌గా ఉన్న ఈ క్రికెటర్ ఇపుడు తండ్రికాబోతున్నాడనే వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
 
ఈ శుభవార్తకు సంబంధించిన తన ప్రియురాలితో కలిసి సంప్రదాయబద్ధమైన దుస్తులో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ, తాను తండ్రికాబోతున్నాననే వార్తను వెల్లడించాడు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈఫోటోలను చూసిన కొందరు నెటిజన్లు అభినందిస్తుంటే, మరికొందరు సంభ్రమాశ్చర్యాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తన ప్రియురాలు గర్భవతి కావడం గమనార్హం.