శుక్రవారం, 7 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శుక్రవారం, 7 నవంబరు 2025 (14:35 IST)

Ramcharan: పెద్ది లోని చికిరి చికిరి సాంగ్ ..రహ్మాన్‌ పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది : రామ్ చరణ్

Ram Charan, Jahnvi.. chikiri chikiri song
Ram Charan, Jahnvi.. chikiri chikiri song
రామ్ చరణ్  రస్టిక్ యాక్షన్ డ్రామా పెద్ది ఫస్ట్ సింగిల్... చికిరి చికిరి ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది, లిరికల్ వీడియోపై భారీ అంచనాలని పెంచింది. భావోద్వేగాలను అద్భుతంగా చూపించే దర్శకుడు బుచ్చి బాబు సాన, ఈసారి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రహ్మాన్‌తో పని చేయడం తన కల నెరవేరినట్టుగా చెప్పారు.

రహ్మాన్‌పై ఆయనకున్న అభిమానాన్ని ఈ ప్రమోలోనే చూపించారు.  పాట సిట్యుయేషన్ రహ్మాన్‌  పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆయన ఈ పాటని సిట్యుయేషన్ తగ్గట్టుగా అద్భుతంగా మలిచారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్‌ ని రిలీజ్ చేసి ఎక్సయిట్మెంట్ ని మరింత పెంచారు.
 
పర్వత ప్రాంతంలో నివసించే పెద్ది.. ఓ రోజు గ్రామంలో తన చికిరిని చూసిన క్షణం నుంచే ఆమె అందం, అమాయకత్వం అతనిని మంత్ర ముగ్ధుడ్ని చేస్తాయి. ఆమెను చూసి కలిగిన ఆ ఆనందాన్ని ప్రతి క్షణం వేడుక చేసుకుంటాడు. ఈ బ్యూటీఫుల్ ఫీలింగ్స్ ని లిరిసిస్ట్ బాలాజీ తన సాహిత్యంలో ఎంతో అద్భుతంగా మలిచారు.
 
ఏఆర్ రహ్మాన్ సంగీతం అద్భుతంగా వుంది. ఫోక్ ఎనర్జీ, మోడర్న్ బీట్‌లతో కంపోజ్ చేసిన చికిరి అదిరిపోయింది. గాయకుడు మొహిత్ చౌహాన్ తన ఎనర్జిటిక్ వోకల్స్ తో పాటకు జీవం పోశారు. జాని మాస్టర్ కొరియోగ్రఫీతో పాట విజువల్స్ మరింత బ్యూటీఫుల్ గా మారాయి.
 
రామ్ చరణ్ రాకింగ్ డ్యాన్స్ మూవ్స్ తో అదరగొట్టారు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్, రిథమ్, హ్యాపీనెస్ ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా వున్నాయి. ఆయన హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్ ప్రేమను సెలబ్రేట్ చేస్తున్న అనుభూతి ఇస్తోంది.
 
జాన్వీ కపూర్ ఇంట్రో షాట్ ఈ సాంగ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆమె దీపాన్ని ఎత్తి తన లుక్‌ని రివీల్ చేసే సీన్ మ్యాజిక్ లా ఉంది. ఆమె గ్రేస్, చార్మ్ అద్భుతంగా వుంది.
 
పాట ట్యూన్, లిరిక్స్, విజువల్స్, ఎనర్జీ అన్నీ కలిపి“చికిరి చికిరి”ను నెక్స్ట్ పాన్-ఇండియా వైరల్ సాంగ్‌గా నిలబెట్టాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, డాన్స్ ఛాలెంజ్‌లకు ఇది పర్ఫెక్ట్ సాంగ్. చికిరి ‘పెద్ది’ మ్యూజికల్ జర్నీకి బ్లాక్‌బస్టర్ స్టార్ట్ ఇచ్చింది.
 
ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  . ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డీవోపీ కాగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్.
 పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.