శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 మే 2017 (11:32 IST)

హేమ పేరు మార్చుకున్నారు.. కోళ్ల హేమ అని పిలవాలట..

వాస్తవానికి ఇండస్ట్రీలోకి రాక ముందు హేమ అసలు పేరు కోళ్ల కృష్ణవేణి. కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హేమగా పేరు మార్చుకుంది.. అదే పేరుతో పాపులర్ అయ్యింది. కానీ మళ్లీ కొళ్ల కృష్ణ వేణి అలియాస్ ''క

ఒకప్పుడు గిరిజ, సూర్యకాంతం, రమాప్రభలు మహిళా హాస్యనటులుగా మంచి పేరు కొట్టేసారు. ప్రస్తుతం హేమ మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై బ్రహ్మానందం, హేమ కాంబినేషన్‌కు మంచి మార్కులు పడిపోయాయి. ప్రస్తుతం హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో జాయింట్ సెక్రటరీ కొనసాగుతుంది. మా ఎన్నికల సందర్భంగా అప్పట్లో వార్తల్లో నిలిచిన హేమ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా నటి హేమ కోళ్ల కృష్ణ వేణి అలియాస్ హేమ అధికారికంగా పేరు మార్చుకుంటున్నట్లు తెలిపారు. 
 
వాస్తవానికి ఇండస్ట్రీలోకి రాక ముందు హేమ అసలు పేరు కోళ్ల కృష్ణవేణి. కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హేమగా పేరు మార్చుకుంది.. అదే పేరుతో పాపులర్ అయ్యింది. కానీ మళ్లీ కొళ్ల కృష్ణ వేణి అలియాస్ ''కోళ్ల హేమ''గా పేరు మార్చుకున్నాను. కావున ఇకపై తనను కోళ్ల హేమగా స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.