గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (17:32 IST)

మంచు మనోజ్‌ను సీఎం చేయండి లేదా పెద్ద మావో నేతగా మార్చండి: పోసాని

నటుడు పోసాని కృష్ణమురళి నోటికి పనిచెప్పారు. తిరుపతి శ్రీ విద్యానికేతన్‌లో జరిగిన మోహన్ బాబు 67వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా పోసాని కృష్ణమురళి హీరో మంచు మనోజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు

నటుడు పోసాని కృష్ణమురళి నోటికి పనిచెప్పారు. తిరుపతి శ్రీ విద్యానికేతన్‌లో జరిగిన మోహన్ బాబు 67వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా పోసాని కృష్ణమురళి హీరో మంచు మనోజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు మనోజ్‌ను సీఎం చేయడం లేదంటే మావోయిస్టు నేతగానైనా మార్చండంటూ పోసాని వ్యాఖ్యానించారు.

అప్పుడైనా మనోజ్‌లోని కోరికలు, ఆశయాలు నెరవేరుతాయని పోసాని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం అంటే మహాత్మాగాంధీ, మానవత్వం పేరెత్తితే మదర్ థెరిస్సా గుర్తొస్తారు. అలాగే దేశంలో విద్య పేరెత్తితే మోహన్‌బాబు గారే గుర్తొస్తున్నారని పోసాని ఆకాశానికెత్తేశారు.
 
మోహన్‌ బాబు కోసం తాను ఇక్కడికి వచ్చానని యు ఆర్ స్వీటెస్ట్, యు ఆర్ హాటెస్ట్, యు ఆర్ హానెస్ట్, యు ఆర్ లేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్ అంటూ మోహన్ బాబు పోసాని కృష్ణ మురళి కొనియాడు. ఇకపోతే.. తాను ఎన్నికల్లో పోటీ చేసిన తరుణంలో రూ. 7లక్షలే ఖర్చుపెట్టడం వల్ల గెలుచుకోలేకపోయానని పోసాని చెప్పారు. అలాగే ఇప్పటి విద్యార్థులకు.. రేపు ఓటు హక్కు వచ్చాక ఓటును అమ్ముకోవద్దని సూచించారు.