శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 20 జనవరి 2017 (19:29 IST)

కిడ్నాప్‌ అయిన పోసాని

తాను కిడ్నాప్‌ అయినా అది తనకు తెలీదనీ, చూసేవారికి ఆసక్తిని కల్గిస్తుందని పోసాని కృష్ణమురళి తెలియజేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్‌ అయ్యాను'. మధురం మూవీ క్రియేషన్స్‌ పతాకంపై మాధవి అద్దంకి నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత ద

తాను కిడ్నాప్‌ అయినా అది తనకు తెలీదనీ, చూసేవారికి ఆసక్తిని కల్గిస్తుందని పోసాని కృష్ణమురళి తెలియజేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్‌ అయ్యాను'. మధురం మూవీ క్రియేషన్స్‌ పతాకంపై మాధవి అద్దంకి నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత దివాకర్‌ బాబు కుమారుడు శ్రీకర్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కార్టూనిస్ట్ మల్లిక్‌ విశిష్ట పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రం శుక్రవారంనాడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 
 
చిత్రం గురించి శ్రీకర్‌ బాబు తెలుపుతూ.. నాలుగు జంటలుగా కొత్తవారిని పరిచయం చేస్తున్నారు. మిగిలినవారు సీనియర్‌ నటీనటులు నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇరవై రోజులపాటు చిత్రీకరణ చేశాక విశాఖ, గోవా పరిసర ప్రాంతాల్లో జరిగే షూటింగ్‌తో పూర్తవుతుంది అని చెప్పారు. పోసాని మాట్లాడుతూ.. బ్యాక్‌గ్రౌండ్‌లో కిడ్నాప్‌ డ్రామాతో చాలా సినిమాలు వచ్చాయి. రామ్‌గోపాల్‌వర్మతో పాటు పలువురు తీశారు. వాటికి పోలికలు లేకుండా ఆసక్తికరంగా కిడ్నాప్‌ నాపై సాగుతుంది. నేను కిడ్నాప్‌ అయ్యాననేది నాక్కూడా తెలీదు. విజువల్‌గా ఆకట్టుకుంటుంది. మంచి అభిరుచిగల నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని' చెప్పారు.
 
కార్టూనిస్ట్ మల్లిక్‌ మాట్లాడుతూ.... నేను కొన్ని సినిమాలకు కథాసహకారం చేశాను. కొన్ని కథలను డెవలప్‌ చేశాను. కార్టూన్స్‌ వేయడం, కథలు రాయడంతో పాటు ఇప్పుడు నటుడిగా ప్రవేశిస్తున్నాను. ఆకట్టుకునే పాత్ర పోషిస్తున్నానని' తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: మల్లిక్‌, సంగీతం: శ్రీకాంత్‌, పాటలు: గంగోత్రి విశ్వనాథ్‌.