1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (15:09 IST)

ప్రభాస్ "కల్కి" ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.191.5 కోట్లు!!

kalki movie
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణెలు కలిసి నటించిన చిత్రం "కల్కి 2898 ఏడీ" చిత్రం తొలి రోజు కలెక్షన్ల దుమ్ముదులిపింది. ఈ చిత్రం ఫస్ట్ డేలో ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు ఆ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వైజయంతీ మూవీస్ బ్యానరుపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగ్ అశ్విన్ దర్శకుడు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాగా, తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టినట్టు ప్రకటించింది. మరోవైపు, ఈ యేడాది ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం రిలీజ్‌కు ముందే పలు రికార్డులను తిరగరాసింది. మహాభారతంలోని ఘట్టాలకు సైన్స్‌కు ముడిపెడుతూ తెరకెక్కించారు. ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా ఈ యేడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా "కల్కి" రికార్డును సొంతం చేసుకుంది. తొలి రోజున ఓవరాల్‌గా ఈ చిత్రం 85.15 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. అలాగే, మ్యాట్నీ షోలలో 81.56 శాతం, ఫస్ట్‌షోలలో 82.33 శాతం, సెకండ్ షోలలో 90.35 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. అంటే ప్రతి పది మంది సినీ ప్రేక్షకుల్లో తొమ్మిది మంది ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.