గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (17:17 IST)

''సీత''గా కాజల్ అగర్వాల్.. లోగో విడుదల

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ జంటగా కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సీత అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. నాయికా ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా లోగోను విడుదల చేశారు. 
 
సీత అనే టైటిల్ లోగోను చాలా అందంగా డిజైన్ చేయించారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు. కాజల్ తొలిసారిగా చేస్తోన్న నాయిక ప్రాధాన్యత గల సినిమా ఇదని సినీ యూనిట్ చెప్తోంది.