సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (14:45 IST)

రొమాన్స్‌కు ఓకే చెప్పిన ప్రియా వారియ‌ర్‌

తెలుగు సినిమాలో రొమాన్స్ అనే ప‌దం చాలా సార్లు వాడుతుంటారు. గ్లామ‌ర్ ఎక్స్‌పోజింగ్ వంటివి హీరోయిన్లు చేసేస్తున్నారు. ఇప్పుడు తాను అందుకు సిద్ధ‌మే అంటోంది మ‌ల‌యాళ న‌టి ప్రియా వారియ‌ర్‌. తెలుగుకూడా నేర్చుకుంటున్న ఆమె ఇటీవ‌లే `ఇష్క్‌` సినిమాలో న‌టించింది. ఈనెలాఖ‌రులో సినిమా విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఆమె చాలా బోల్డ్‌గానే స‌మాధానాలిచ్చింది.
 
మ‌ల‌యాళంలోకంటే తెలుగులో న‌టిగా గ్లామ‌ర్ పాత్ర‌లు వ‌స్తే ఏం చేస్తారు? అని అడిగితే, నేను దేనికైనా ముందు కంటెంట్ చూస్తాను. ఆ త‌ర్వాత బేన‌ర్ అనిచెబుతూ అన్ని పాత్ర‌లు చేయ‌డానికి సిద్ధ‌మేనంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. బి.కాం. పూర్త‌య్యాక సినిమాలోకి సీరియ‌స్‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్న ప్రియా ప‌లు తెలుగు సినిమాల్లో బుక్ అయింది. అయితే మాల‌యాళంలో ఇంత‌వ‌ర‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేద‌ట‌. వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తానంటోంది.