మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (09:43 IST)

ఆస్కార్ అవార్డులకు నామినేషన్స్... సూర్యకు చుక్కెదురు.. మాంక్ అదుర్స్

Nick Jonas
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ విడుదలయ్యాయి. 93వ అకాడమీ అవార్డుల ప్రదానం అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 25న జరగనుండగా, సోమవారం సాయంత్రం ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు నామినేషన్ జాబితాను విడుదల చేశారు. డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన మాంక్ చిత్రం 10 విభాగాల్లో నామినేషన్లు పొందడం విశేషం. 
 
ఇక గత ఏడాది దర్శకత్వ విభాగంలో మహిళలను పట్టించుకోకపోవడం పై ఆస్కార్‌పై తీవ్ర విమర్శలు రావడంతో తొలిసారి ఇద్దరు మహిళలు (క్లో ఝావో, ఎమరాల్డ్ ఫెన్నెల్) లను నామినేట్ చేశారు. ఝావో ఆస్కార్ నామినేషన్ పొందిన తొలి ఆసియా సంతతి మహిళ. ఇక ఇదిలా ఉంటే భారత్ నుంచి ఆస్కార్ కు వెళ్లిన తమిళ హీరో సూర్య చిత్రం సూరారై పొట్రు ఫైనల్ నామినేషన్స్ పొందడంలో విఫలమైన విదితమే.
 
ఏ కేటగిరీకి ఎవరెవరు నామినేట్ అయ్యారంటే...
ఉత్తమ చిత్రం
ద ఫాదర్
జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్యా
మాంక్
మినారి
నోమాడ్ ల్యాండ్
ప్రామిసింగ్ యంగ్ ఉమన్
సౌండ్ ఆఫ్ మెటల్
ద ట్రయల్ ఆఫ్ షికాగో 7
 
ఉత్తమ దర్శకుడు
క్లో ఝావో (నోమాడ్ ల్యాండ్)
లీ ఇసాక్ చుంగ్ (మినారి)
డేవిడ్ ఫించర్ (మాంక్)
ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమన్)
థామస్ వింటర్ బెర్గ్ (ఎనదర్ రౌండ్)
 
ఉత్తమ నటి
కేరీ ముల్లిగాన్ (ప్రామిసింగ్ యంగ్ ఉమన్)
ఫ్రాన్సెస్ మెక్ డోర్మాండ్ (నోమాడ్ ల్యాండ్)
వయోలా డేవిస్ (మా రెయినీస్ బ్లాక్ బాటమ్)
వెనెస్సా కిర్బీ (పీసెస్ ఆఫ్ ఏ ఉమన్)
ఆండ్రా డే (ద యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే)
 
ఉత్తమ నటుడు
చాడ్విక్ బోస్ మన్ ( మా రెయినీస్ బ్లాక్ బాటమ్)
రిజ్ అహ్మద్ (సౌండ్ ఆఫ్ మెటల్)
ఆంథోనీ హాప్కిన్స్ (ద ఫాదర్)
గ్యారీ ఓల్డ్ మన్ (మాంక్)
స్టీవెన్ యేన్ (మినారి)
 
ఉత్తమ సహాయనటి
మరియా బకలోవా (బోరాట్ సబ్ సీక్వెంట్ మూవీ ఫిల్మ్)
గ్లెన్ క్లోజ్ (హిల్ బిల్లీ ఎలెజీ)
ఒలీవియో కోల్మన్ (ద ఫాదర్)
అమందా సేఫ్రీడ్ (మాంక్)
యు జంగ్ యోన్ (మినారి)
 
ఉత్తమ సహాయనటుడు
సాషా బరోన్ కోహెన్ (ద ట్రయల్ ఆఫ్ షికాగో 7)
లెస్లీ ఓడోమ్ జూనియర్ (వన్ నైట్ ఇన్ మయామీ)
డేనియల్ కలూయా (జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్యా)
పాల్ రేసీ (సౌండ్ ఆఫ్ మెటల్)
లాకీత్ స్టాన్ ఫీల్డ్ (జూడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్య)
 
ఇవే కాకుండా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, వంటి ఇతరత్రా కేటగిరీల్లో ఆస్కార్ నామినేషన్లు ప్రకటించారు.