శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 4 ఆగస్టు 2020 (21:53 IST)

ప్రియతమా... త్వరలో వస్తోంది

వంశీకృష్ణ, ఆనంద్ కుమార్, వికాస్ చంద్ర హీరోలుగా, ఉషా, రూపాలి సెలోకర్, ఏంజెల్ గరేవాల్ హీరోయిన్లుగా నిర్మితమైన చిత్రం"ప్రియతమా". ఎనీథింగ్ ఫర్ లవ్" అనేది ఉపశీర్షిక. 
ఆర్కె టాకీస్ పతాకంపై కర్నూలుకు చెందిన ప్రముఖ నాయకుడు పులకుర్తి కొండయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. ఆగస్టు 5న నిర్మాత కొండయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
 
"అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు తీయాలని తొలి ప్రయత్నంగా "ప్రియతమా" చిత్రాన్ని నిర్మించాను. మా ఆర్కె టాకీస్ బేనర్ నుండి సామాజిక సందేశాన్ని అందించే చిత్రాలతో పాటు పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రాల్ని కూడా నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాము. తొలి ప్రయత్నంగా నిర్మించిన ప్రియతమా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.
 
ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశాం. ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం" అన్నారు. చంద్ర మోహన్, సుమన్ షెట్టి, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు, ఫిష్ వెంకట్, చిత్రం శ్రీను, ఎఫ్.ఎం.బాబాయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఏ కె జంపన్న, సంగీతం: చైతన్య, సినిమాటోగ్రఫీ: ఆనెం వెంకట్, కొరియోగ్రఫీ: బ్రదర్ ఆనంద్, దర్శకత్వం: సంతోష్ పార్లవార్