శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 24 జులై 2020 (20:48 IST)

దర్శనాల కొనసాగింపుకే మొగ్గు చూపుతున్న టిటిడి

తిరుమల దేవస్థానంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్వామి వారికి ఏకాంతంగా పూజలు నిర్వహించి, స్వామి దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆలయ గౌరవ అర్చకులు రమణ దీక్షితులుతో పాటు అర్చకులు, పలువురు ఉద్యోగులు వాపోతుంటే టిటిడి మాత్రం దర్శనాల కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 
 
తిరుపతిలో లాక్‌డౌన్ మూలంగా సర్వదర్శనం టోకెన్లు జారీని తాత్కలికంగా నిలిపివేసిన టిటిడి ఆగస్ట్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్లో విడుదల చేసింది. రోజుకి తొమ్మిది వేల మంది దర్శనానికి వచ్చే విధంగా  టిక్కెట్లను ఆన్ లైన్లో ఉంచింది. 
కరోనా మూలంగా భక్తులు దర్శనాలు సంఖ్య రోజుకు 12 వేల నుంచి 9 వేలకు తగ్గిపోయింది.