శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (15:49 IST)

ఆ పొలం విషయంలో హీరో రవితేజను మోసం చేశా : నిర్మాత బండ్ల గణేష్

కమెడియన్‌ స్థాయి నుంచి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్‌, జూ.ఎన్టీయార్‌, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి హీరోలతో పలు చిత్రా

కమెడియన్‌ స్థాయి నుంచి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్‌, జూ.ఎన్టీయార్‌, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి హీరోలతో పలు చిత్రాలు నిర్మించాడు. 
 
ఆ తర్వాత జూనియ్ ఎన్టీఆర్‌తో ‘టెంపర్‌’ సినిమా తీశాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ఒక్కసారి అదృశ్యమైపోయాడు. తాజాగా పవన్‌తో దిగిన ఫోటోను ట్వీట్‌ చేసి మళ్లీ వార్తల్లోకెక్కాడు బండ్ల గణేష్‌. తాజాగా ఓ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. గతంలో ఓసారి హీరో రవితేజను మోసం చేశానని అంగీకరించాడు. రవితేజ ఎంతో ఇష్టపడి తన దగ్గర పొలం కొనుక్కున్నాడని, అయితే ఆ పొలం విషయంలో ఆయనను మోసం చేశానని తెలిపాడు. 
 
అలాగే జూనియర్‌ ఎన్టీయార్‌తో చేసిన ‘బాద్‌షా’ సినిమా వల్ల తాను ఎంతో నష్టపోయానని, అప్పట్నుంచే ఎన్టీయార్‌తో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పాడు. ఇక, తన దేవుడు పవన్‌ కళ్యాణ్‌కు ఎవరూ సహాయం చేయనవసరం లేదని, తన సమస్యను ఆయనే పరిష్కరించుగోలడని అన్నాడు. అలాగే ఓ దర్శకుడు రాత్రంతా మందు కొడుతూ, డ్రగ్స్‌ తీసుకుంటూ గడుపుతాడని, ఆయనతో పనిచేయడం తన దురదృష్టమన్నాడు. ఆ దర్శకుడి పేరు చెప్పడానికి మాత్రం బండ్ల గణేష్ నిరాకరించాడు.