శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (11:33 IST)

నాగశౌర్య, మాళవిక నాయర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ప్రోగ్రెస్

Nagashaurya, Malavika Nair
Nagashaurya, Malavika Nair
నాగశౌర్య, మాళవిక నాయర్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2022లో 'ధమాకా', 'కార్తికేయ 2' చిత్రాలతో మరో రెండు భారీ విజయాలను అందుకుంది.
 
హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలిసి గతంలో 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' అనే రెండు గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. ఈ రెండు చిత్రాలూ వారిలోని ప్రతిభను బయటకు తీసుకొచ్చాయి. థియేటర్లలో ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాలు టీవీ, ఓటీటీ లలో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు 'ఫలానా అబ్బాయి ఫలానా అబ్బాయి'తో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.
 
ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. నాగ శౌర్య, మాళవిక నాయర్ ఇద్దరూ ఫార్మల్ వింటర్‌వేర్ ధరించి, ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపించారు. పోస్టర్ లో అందమైన వస్త్రధారణతో, అంతకంటే అందంగా ఉన్న ఆ జంటను చూస్తుంటే.. ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ ఎప్పుడెప్పుడా చూస్తామా అనే ఆసక్తి కలగక మానదు.
 
నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ అనౌన్స్‌మెంట్ వీడియోకి కూడా మంచి స్పందన లభించింది. ఆ వీడియోలో శ్రీనివాస్ అవసరాలతో కాల్ మాట్లాడిన హీరోహీరోయిన్లు సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్‌లు లేకపోవడంపై చర్చించారు. "ఆర్ఆర్ఆర్ కూడా విడుదలైంది" అని శౌర్య అనగా.. "ఆర్ఆర్ఆర్ లో మూడే అక్షరాలు ఉన్నాయని, ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి(PAPA)లో నాలుగు అక్షరాలు ఉన్నాయి" అంటూ శ్రీనివాస్ అవసరాల సరదాగా బదులిచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ లుక్ జనవరి 2న రాబోతుందని తెలిపారు.
 
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనేది ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణం. హెచ్చు తగ్గులతో కూడిన ఆ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఈ చిత్రంలో ప్రేమను ఇంద్రధనస్సు లాగా ఏడు విభిన్న రంగులలో ప్రదర్శించబోతున్నట్లు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెలిపారు. శ్రీనివాస్ అవసరాల సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.
 
గతంలో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కలయికలో వచ్చిన రెండు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్, 'ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి'కి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. విడుదల తేదీతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
 
నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్
నిర్మాతలు - టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి దర్శకుడు - శ్రీనివాస్ అవసరాల
సహా నిర్మాత - వివేక్ కూచిభొట్ల
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - శ్రీనివాస్ అవసరాల
డీవోపీ - సునీల్ కుమార్ నామ
సంగీతం - కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
ఎడిటర్ - కిరణ్ గంటి
ఆర్ట్ డైరెక్టర్ - అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సుజిత్ కుమార్ కొల్లి
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ - సునీల్ షా, రాజా సుబ్రమణియన్
లిరిక్స్ - భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
కొరియోగ్రాఫర్స్ – రఘు, యశ్, రియాజ్, చౌ, గులే
కో-డైరెక్టర్స్ - శ్రీనివాస్ డి, హెచ్.మాన్సింగ్ (హెచ్.మహేష్ రాజ్)
మేకప్ - అశోక్, అయేషా రానా
కాస్ట్యూమ్ డిజైనర్ - హర్ష చల్లపల్లి
 PMF కంటెంట్ హెడ్ - సత్య భావన కాదంబరి
హెడ్ డిజిటల్ మార్కెటింగ్ - వాణి మాధవి అవసరాల
పబ్లిసిటీ డిజైన్ - అనిల్ భాను
పీఆర్ఓ - లక్ష్మి వేణుగోపాల్
PMF డిజిటల్ మీడియా ప్రమోషన్స్- ప్రమదేష్.వి