ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (12:21 IST)

ఆ దర్శకుడు ఓ అమ్మాయిని గర్భవతిని చేసి కెరీర్ నాశనం చేశారు.. పూనమ్ కౌర్

poonam kaur
సినీ నటి, పంజాబీ భామ పూనమ్ కౌర్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. చిత్రపరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు ఒక అమ్మాయిని గర్భవతిని చేసి కెరీర్ నాశనం చేశాడంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆమె బుధవారం ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఇండస్ట్రీలో ఓ దర్శకుడు ఒక అమ్మాయిని గర్భవతిని చేసి ఆమె కెరీర్ నాశనం చేశాడని, మా జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికిందని పూనమ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, అతడు లీడర్‌గా మారిన నటుడు మాత్రం కాదని కూడా ఆమె హింట్ ఇచ్చారు. 
 
అయితే, ఈ విషయంలో తనను ఓ నటుడు లేదా రాజకీయ నేతను అనవసరంగా లాగారని ఆమె వాపోయారు. ఈ ట్వీట్‌లో పూనమ్ ఎవరి పేర్లను ప్రస్తావించలేదు. కాగా, ఆమె ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పూనమ్ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.