బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 జులై 2024 (20:02 IST)

విజ‌య‌సాయి.. శాంతికి మద్దతిచ్చిన పూనమ్ కౌర్.. ఏడిస్తే వారికే గెలుపు...

poonam kaur
దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి- ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంపై ఘటనపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. పూన‌మ్ కౌర్ త‌న మ‌ద్ద‌తు విజ‌య సాయిరెడ్డికే అని తెలిపారు. "ట్విట్టర్ వేదికగా దీని గురించి ఆమె పోస్ట్ పెడుతూ "విజ‌య‌సాయి రెడ్డిగారూ.. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. టీవీ ఛానెళ్లు బ్లాక్ మెయిల్ చేసే వ్య‌వ‌స్థ‌ల్లా త‌యార‌య్యాయి." అని పూనమ్ కౌర్ వెల్లడించింది.
 
"నా విషయంలోనూ ఇలాంటి డ్రామానే వాడారు. ప్రెగ్నెంట్ అయిందని, మనీ తీసుకుందని, పని కోసం ఇలా చేసిందని చెబుతారు మనం ఏడిస్తే.. కన్నీరు కారిస్తే అదే వారి విజయం అవుతుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తల వంచకండి." అంటూ తెలిపారు. 
 
గిరిజ‌న మ‌హిళ అయిన శాంతికుమారి త‌ర‌ఫున నిల‌బ‌డిన విజ‌య‌సాయి రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు నిజాన్ని వెలికి తీసి, అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నాను.. అంటూ పూనమ్ కౌర్ అన్నారు. 
 
అలాగే శాంతికుమారికి పూనమ్ కౌర్‌ మద్దతుగా నిలిచారు. బుద్ధిలేని టీవీ ఛానెళ్లు ఆమె గ‌ర్భం దాల్చింద‌ని తెలీగానే ఎవ‌రి దగ్గ‌రో డ‌బ్బు తీసుకుంద‌ని.. సేమ్ క‌థ‌ను రిపీట్ చేస్తున్నారు. నేను శాంతికి ఒక్క‌టే చెప్పాల‌నుకుంటున్నాను. నువ్వు ఏడిస్తే అది వారికి గెలుపు అవుతుంది. ఇలాంటి వెధవ‌ల కోసం నీ క‌న్నీరును వృథా చేసుకోకు. నీకు న్యాయం జ‌రిగేలా చూసేందుకు నీ భ‌ర్త నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు అని పూనమ్ కౌర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.