శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 13 మే 2021 (20:19 IST)

గుండె జ‌బ్బుని త‌గ్గించే మెడిసిన్ ఇదే అంటున్న పూరీ

puri jaganath
ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ మ్యూజిమ్స్ పేరుతో ర‌క‌ర‌కాలుగా సూక్తులు చెబుతున్నాడు. మొన్న‌నే రాజ‌ముడి అనే రైస్ గురించి వెల్ల‌డించాడు. అవి రాజుకు ముడిగా డ‌బ్బు బ‌దులు ఒక‌ప్పుడు రైతులు శిస్తు కింద ఇచ్చేవారు. అస‌లు బియ్యంలో వేల ర‌కాలున్నాయ‌ని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు అన్ని లేవ‌నుకోండి. ఇక ఈరోజు మందు ప్రియుల‌కు శుభవార్త‌లా వైన్ గురించి క్లారిటీ ఇస్తున్నాడు. అదే రెడ్ వైన్‌.
 
రెడ్ వైన్ తాగ‌డం వ‌ల్ల గుండె స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఆడాళ్ళు, మ‌గాళ్ళు కూడా వీటిని తాగ‌వ‌చ్చు. చెరో గ్లాస్ తాగితే మంచిది. అది తాగితే రొమాంటిక్ మూడ్ కూడా వ‌స్తుంది. అస‌లు వైన్ తాగ‌డం ఓ ఆర్ట్‌. దాన్ని ఆస్వాదిస్తూ తాగాలి. ముందుగా ఓ గ్లాస్ తీసుకోవాలి. అది కూడా బాటిల్‌లోని గ్రూప్ కు స‌రిప‌డా గ్లాస్ తీసుకోవాలి. ఎందుకంటే గ్రేప్ కు స‌రిప‌డా గ్లాస్‌లు 18 మోడ‌ల్స్ వున్నాయి. ముందుగా స్మెల్ ఆస్మాదించాలి. త‌ర్వాత కొద్దిగా వైస్ పోసుకుని దానిని కొద్దిగా తిప్పాలి. చీజ్ ఆలీవ్ ద‌గ్గ‌ర పెట్టుకుని మెల్ల‌గా సిప్ చేయాలి. ఇలా చేస్తే గుండె జ‌బ్బులు రావ‌ని పూరి తెలియ‌జేస్తున్నాడు. అంటే ఆయ‌న తాగేది చెబుతున్నాడు.