ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (11:29 IST)

'పుష్ప'కు అరుదైన గౌరవం : ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక

హీరో అల్లు అర్జున్ - దర్శకుడు కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "పుష్ప : ది రైజ్". ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 'ది ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌'గా ఎంపిక కావడం గమనార్హం.
 
గత యేడాది డిసెంబరు నెల 17వ తేదీన విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. పైగా, బాలీవుడ్‌‍లో హిందీ చిత్రాల కలెక్షన్లను అధికమించింది. ఈ నేపథ్యంలో ఇపుడు 'పుష్ప మూవీ ఆఫ్ ది ఇయర్‌'గా నిలిచింది. అనేక బాలీవుడ్ చిత్రాలను అధికమించడం గమనార్హం. 
 
అలాగే, '83' చిత్రంలో నటనకుగాను రణ్‌వీర్ సింగ్, 'మీమీ' చిత్రానికిగాను ఉత్తమ నటిగా కృతి సనన్‌ అవార్డులు అందుకున్నారు. అలాగే, 'పుష్ప' చిత్రం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు 2022ను సొంతం చేసుకుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ముంబైలో జరిగింది.