ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 14 సెప్టెంబరు 2024 (20:52 IST)

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

AKKINENI NAGESWARA RAO
పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్, భారతదేశపు అతి పెద్ద, అత్యంత ప్రీమియం సినిమా ఎగ్జిబిటర్ దిగ్గజ తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వర రావు (ఏఎన్ఆర్) 100వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఘన నివాళిగా అక్కినేని నాగేశ్వర రావు ఫిల్మ్ ఫెస్టివల్‌ను గర్వంగా ప్రకటించింది. నట సామ్రాట్‌గా అందరూ పిలిచే, ఏఎన్ఆర్ భారతదేశపు సినిమా రంగంలోనే తిరుగులేని రారాజుగా నిలిచారు, ఫిల్మ్ పరిశ్రమలో ఆయన ఆకర్షణీయమైన నటనా పాటవం చెరగని ముద్ర వేసింది. ఈ మూడు రోజుల ఫిల్మ్ ఫెస్టివర్ 20 సెప్టెంబర్ నుండి 22 సెప్టెంబర్ 2024 వరకు కొనసాగుతుంది. పెద్ద తెరపై ఏఎన్ఆర్ దిగ్గజ ఫిల్మ్స్‌లో లీనమవడానికి ఆయన అభిమానులకు అరుదైన అవకాశం అందిస్తోంది.
 
ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ సహకారంతో, ఫెస్టివల్ ఏఎన్ఆర్ యొక్క ఎంపిక చేయబడిన దేవదాసు, మాయాబజార్, భార్యాభర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్, మనం సహా అత్యంత విజయవంతమైన మూవీలను ప్రదర్శిస్తుంది. ఈ ఫెస్టివల్ 31 పట్టణాలలో నిర్వహించబడుతుంది, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు భారతీయ సినిమాకు ఏఎన్ఆర్ అందించిన సాటిలేని తోడ్పాటును గౌరవించడానికి అవకాశం ఇస్తుంది.
 
శ్రీ. గౌతమ్ దత్తా, పివిఆర్ ఐనాక్స్ లిమిటెడ్ యొక్క సిఈఓ ఫెస్టివల్ గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు, “అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి ఉత్సవాలను సంబరం చేయడానికి మేము ఎంతో వినమ్రంగా ఉన్నాము. ఆయన సినీ ప్రయాణం ఒక ఇతిహాసానికి ఎంత మాత్రం తీసిపోదు. ఆయన శక్తివంతమైన నటనా చాతుర్యం తరతరాలను దాటింది, ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు స్ఫూర్తినిస్తున్నాయి. ఈ ఫెస్టివల్ ఆయన లోతైన వారసత్వానికి మా నివాళి, ఏఎన్ఆర్ శాశ్వతమైన అపురూప చిత్రాలను మళ్లీ పెద్ద స్క్రీన్ పైన ప్రదర్శించడానికి ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్‌తో భాగస్వామం చెందడానికి మేము ఉల్లాసంగా ఉన్నాము. ఈ చొరవ అంకితభావం గల అభిమానులు, కొత్త ప్రేక్షకులు ఇరువురు పాల్గొనేలా చేస్తుందని, థియేటర్లలో మరొకసారి ఏఎన్ఆర్ యొక్క నటనా కౌశల్యాన్ని అనుభవించే అవకాశం వారికి అందిస్తుందని ఆశిస్తున్నాము.”
 
ఏఎన్ఆర్ ప్రతిష్టాత్మకమైన కెరీర్ ఆరు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆయన ఫిల్మోగ్రఫీ విషాద నాటకాల నుండి హృదయాన్ని కదిలించే కుటుంబ గాథల వరకు ఆయన సాటిలేని నటుడ్ని చూపిస్తుంది. దేవదాసు, మాయాబజార్ వంటి ఫిల్మ్స్‌లో ఆయన పాత్రలు ఆయన స్థానాన్ని సాంస్కృతిక దిగ్గజంగా దృఢతరం చేసాయి, సినిమాకు ఆయన అంకితభావం ఆయనకు ఎనలేని గౌరవం, ఆరాధనను సంపాదించింది.
 
షివేంద్ర శింగ్ దుంగార్పూర్, ఫిల్మ్ మేకర్ మరియు డైరెక్టర్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ ఫెస్టివల్ గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు, “అక్కినేని నాగేశ్వర రావు భారతీయ సినిమాకు నిజమైన టైటాన్, ఈ ప్రముఖ ఫెస్టివల్‌తో మనం చేసే వేడుక ఆయన శత జయంతోత్స్యవాలకు తగినటువంటిది. పివిఆర్ ఐనాక్స్‌తో మా భాగస్వామం ద్వారా, ఫిల్మ్స్‌కు ఏఎన్ఆర్ సాటిలేని తోడ్పాటు సంరక్షించబడి, భావితరాలకు ప్రదర్శించడటాన్ని మేము నిర్థారిస్తున్నాము. ద ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ అపురూప చిత్రాలను పునరుద్ధరించడానికి కట్టుబడింది. భారతీయ సినిమా యొక్క దిగ్గజాలను గౌరవించడానికి మా మిషనలో ఈ ఫెస్టివల్ ఒక ముందడుగు.”
 
అక్కినేని నాగార్జున ఇలా అన్నారు, “ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ మా నాన్నగారి 100వ జయంతోత్స్యవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన బ్లాక్‌బస్టర్ సినిమాల ఫెస్టివల్‌తో వేడుక చేస్తున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. సన్యాసి నుండి, తాగుబోతు వరకు, దశాబ్దాలుగా ప్రజల మనస్సులు, హృదయాల్లో ఒక విధంగా రొమాంటిక్ హీరోగా నిలిచిన ఆయన పోషించిన వివిధ పాత్రల యొక్క అద్భుతమైన నటనా సామర్థ్యానికి ఆయనను నట సామ్రాట్ అని పిలవడం సరైనది. దేవదాసులో ఆయన ప్రదర్శించిన నటన సినిమాల్లోని అన్ని వెర్షన్స్‌లో అత్యంత ఉత్తమమైనదిగా గుర్తించబడింది. ప్రేమాభిషేకం, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు వంటి సినిమాలను ఈనాటికి కూడా అందరూ అభిమానిస్తున్నారు.
 
అన్నపూర్ణ స్టుడీయోస్‌ను స్థాపించి, మన రాష్ట్రంలో తెలుగు ఫిల్మ్ పరిశ్రమకు మొదటిసారి పునాది వేసిన మార్గదర్శి ఆయన. ఆయన వారసత్వానికి మేము అందరం ఎంతో గర్విస్తున్నాం. ఈ ఫెస్టివల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆయనను కేవలం తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా భారతీయ సినిమాకే దిగ్గజంగా గుర్తుంచుకుంటారు. మేము ఈ వారసత్వాన్ని సంరక్షించాలని కోరుకుంటున్నాం. అందువలన ప్రజలు ఆయనను మరొక వందేళ్లు గుర్తుంచుకుంటారు. ఈ ఫెస్టివల్‌ను సాధ్యం చేయడంలో మాతో భాగస్వామ్యం చేసినందుకు ఎన్ఎఫ్ డిసి-ఎన్ఎఫ్ఏసికి, పివిఆర్-ఐనాక్స్‌కు  పూర్తి అక్కినేని కుటుంబం ధన్యవాదాలు తెలుపుతోంది.”
 
ప్రీతుల్ కుమార్, జాయింట్ సెక్రటరీ(ఫిల్మ్స్), మేనేజింగ్ డైరెక్టర్, ఎన్ఎఫ్ డిసి- నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా ఇలా అన్నారు, “ఆర్కైవ్ కలక్షన్లో ఉన్న ప్రింట్లు రియు నెగిటివ్స్ నుండి 4Kలో పునరుద్ధరించిన ఏడు ఆణిముత్యాల వంటి సినిమాలను అందచేయడం ద్వారా శ్రీ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి ఉత్సవాలకు జ్ఞాపకార్థం సహకరించడానికి ఎన్ఎఫ్ డిసి-ఎన్ఎఫ్ఏఐ ఎంతో గర్విస్తోంది. ఈ కార్యక్రమం ఈ గొప్ప నటుడికి కేవలం నివాళి మాత్రమే కాకుండా భారతీయ సినిమా యొక్క సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పొందుపరిచి, ప్రోత్సహించడానికి కూడా మా నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం. ఈ కళాఖండాలను మళ్లీ పెద్ద స్క్రీన్ పైకి తీసుకురావడం ద్వారా, మన ఫిల్మ్ చరిత్ర యొక్క స్వర్ణ యుగంతో ప్రేక్షకులు మళ్లీ కనక్ట్ అయి మధుర జ్ఞాపకాలతో గర్వించగలిగే భావనను ప్రేరేపించగలమని మేము ఆశిస్తున్నాము. ఈ చిత్రాలను దేశంతో భాగస్వామం చేయడానికి వేదికను అందించిన పివిఆర్-ఐనాక్స్‌కు, కూర్పు చేసి ప్రణాళిక చేసిన అన్నపూర్ణ స్టూడియోస్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్‌కు, నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ ద్వారా ఈ ప్రయత్నానికి నిధులు సమకూర్చిన సమాచారం, ప్రసార శాఖకు మేము వినయంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.”
 
షోకేసులోని ప్రతి సినిమా ఏఎన్ఆర్ యొక్క సాటిలేని విలక్షణతను చాటుతుంది. తెలుగు సినిమా యొక్క సుసంపన్నమైన వారసత్వాన్ని వేడుక చేస్తుంది. ఈ ఫెస్టివల్ ద్వారా, పివిఆర్ ఐనాక్స్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ లు ఏఎన్ఆర్ శాశ్వతమైన అపురూప చిత్రాలను ఆధునిక తరానికి చెందిన ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఆయన నటనా పాటవానికి ఆరాధనను పునరుజ్జీవింప చేసే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. అక్కినేని నాగేశ్వర రావు ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్ వంటి ప్రధానమైన నగరాలు సహా 32 నగరాలలో ప్రదర్శించబడుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ సినీ దిగ్గజం వేడుకలలో పాల్గొనడానికి అవకాశం ఇస్తుంది.