గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (12:45 IST)

ఆ చిత్రానికి స్కిన్‌షోనే మెయిన్‌ ఎట్రాక్షన్‌.. మరి చిరంజీవి సంగతేంటి?: రాయ్‌లక్ష్మి

తెలుగు చిత్ర పరిశ్రమలో రాయ్‌లక్ష్మి అలియాస్ లక్ష్మీరాయ్ పని అయిపోయిందని అందరూ భావించారు. అలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఖైదీ నంబరు 150’లో నటించి తన ఐటెంసాంగ్‌తో తెలుగువారిని ఓ ఊపు ఊపింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో రాయ్‌లక్ష్మి అలియాస్ లక్ష్మీరాయ్ పని అయిపోయిందని అందరూ భావించారు. అలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఖైదీ నంబరు 150’లో నటించి తన ఐటెంసాంగ్‌తో తెలుగువారిని ఓ ఊపు ఊపింది. తెలుగులో తనకు లక్‌ కలిసి రాకపోయినా, బాలీవుడ్‌లోనైనా అదృష్టం కలిసి వస్తుందని బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించింది. 
 
ఖైదీ నంబర్ 150 చిత్రంలో చిరంజీవితో డ్యాన్స్‌ చేయడానికి పెద్దగా కష్టపడలేదని చెప్పింది. కానీ, కంగారు పడినట్టు తెలిపింది. బేసిక్‌గా నేను డ్యాన్సర్ని కనుక కష్టం అనిపించలేదు. ఆయన వేగంతో పోటీ పడడానికి మాత్రం ఇబ్బంది పడ్డాను. తరువాత అలవాటైపోయిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. 
 
ఇక బాలీవుడ్‌లో నటిస్తున్న 'జూలీ-2' చిత్రంపై స్పందిస్తూ ఇది నా కెరీర్‌లో మరిచిపోలేని సినిమా అవుతుంది. ఇప్పటి వరకూ నా నటనను పూర్తి స్థాయిలో చూపించే అవకాశం రాలేదు. ఈ సినిమాతో ఆ కొరత తీరిపోతుంది. నటన ఒక్కటే కాదు. ఈ సినిమాలో కొత్త రాయ్‌లక్ష్మిని చూస్తారు. బికినీ వేసినా, అది సన్నివేశపరంగా వస్తుందే తప్ప కావాలని వేసినట్టు అనిపించదు. గతంలో ‘జూలీ’లో నేహాధూపియా చేసింది. ఆ సినిమాకి తన స్కిన్‌షోనే ప్రధాన ఎట్రాక్షన్‌ అయింది. ‘జూలీ 2’ అలా కాదు. గ్లామర్, యాక్షన్ సహా అన్నీ సమపాళ్లలో ఉంటాయి.