మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (09:41 IST)

తమిళనాడు సంక్షోభం : పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన లారెన్స్

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతూ వచ్చాయి. ముఖ్యమంత్రి కుర్చీకోసం సాగుతున్న పోటీలో పన్నీర్ సెల్వం, శశికళలు నువ్వానేనా అన్న రీతిలో తలపడుతున్నారు. ప్రజా మద్దతు సంపూర్ణంగా పన్నీర్‌కు ఉంట

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతూ వచ్చాయి. ముఖ్యమంత్రి కుర్చీకోసం సాగుతున్న పోటీలో పన్నీర్ సెల్వం, శశికళలు నువ్వానేనా అన్న రీతిలో తలపడుతున్నారు. ప్రజా మద్దతు సంపూర్ణంగా పన్నీర్‌కు ఉంటే.. ఎమ్మెల్యేల మద్దతు శశికళకు ఉంది. 
 
ఈ నేపథ్యంలో... జల్లికట్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించిన సినీ నటుడు, డాన్స్‌ మాస్టర్‌ రాఘవ లారెన్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలోని గ్రీన్‌వేస్‌ రోడ్డులోగల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించారు. 
 
పన్నీర్‌ సెల్వం, ఇతర నేతలు ఆత్మీయ ఆలింగనాలతో రాఘవ లారెన్స్‌కు స్వాగతం పలికిన అనంతరం ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించానని, అన్నీ ఆలోచించిన మీదట పన్నీర్‌ సెల్వానికి మద్దతు పలకాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. 
 
జయలలిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లగల సత్తా ఓపీఎస్‌కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. లారెన్స్‌ కంటే ముందే సీనియర్‌ కమల్ హాసన్, శరత్ కుమార్, ఖుష్బూ, గౌతమిలతో పాటు.. అనేక మంది పన్నీర్‌కు మద్దతు తెలిపిన విషయం తెలసిందే.