బాత్ రూమ్‌లో కాలుజారి పడిన రాగిణి ద్వివేది.. యూరిన్ శాంపిల్స్‌లో నీళ్లు పోసి..?

ragini dwivedi
ragini dwivedi
సెల్వి| Last Updated: మంగళవారం, 13 అక్టోబరు 2020 (19:56 IST)
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రాగిణి ద్వివేది జైలు బాత్ రూమ్‌లో కాలు జారి పడిందట. శాండిల్ వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ రాగిణి ద్వివేదిని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు.

రాగిణి కి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన సీసీబీ ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ సంజన మరియు పలువురు డ్రగ్ పెడ్లర్స్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది సెప్టెంబర్ 4న అరెస్ట్ అయింది.

అయితే ప్రస్తుతం పరప్పన జైలులో ఉన్న హీరోయిన్స్ ఈ కేసులో మొదటి నుంచి విచారణకు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. మూత్ర పరీక్షల కోసం రాగిణికి ఒక చిన్న సీసా ఇవ్వగా.. అందులో ఆమె మూత్రానికి బదులు నీళ్లు పోసి ఇచ్చిందని కన్నడ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో హీరోయిన్లు రాగిణి - సంజన బెయిల్ పిటిషన్లను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.

అంతేకాదు సంజన..రాగిణిల మధ్య పాత గొడవలు కూడా ఉన్నాయి. వీరిద్దరితో వేగలేకపోతున్నారట పోలీసులు. వారికి తలనొప్పిగా మారారట. ఇదిలా ఉండగా పరప్పన జైల్లో ఉన్న రాగిణి ద్వివేది బాత్ రూమ్‌లో జారిపడి గాయపడినట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :