గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (11:17 IST)

'బాహుబలి 3' తీయమన్న బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్స్ : ప్రేక్షకులను మోసం చేయలేనన్న రాజమౌళి

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి హవా బ్రిటన్‌లోనూ కొనసాగుతోంది. ఈ జక్కన్న తీసిన 'బాహుబలి 2' చిత్రం గత నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రభంజనం సృష్టిస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న విషయం తె

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి హవా బ్రిటన్‌లోనూ కొనసాగుతోంది. ఈ జక్కన్న తీసిన 'బాహుబలి 2' చిత్రం గత నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రభంజనం సృష్టిస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం కోసం ఐదేళ్ళ పాటు శ్రమించిన రాజమౌళి.. ఈ చిత్రం విడుదల తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీవిహార యాత్రకు వెళ్లారు.
 
ఈ సందర్భంగా బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులను ఉద్దేశించి రాజమౌళి ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ బాహుబలి-3 తీయాలని కోరారు. 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి 2 ది కంక్లూజన్' చిత్రాలు విజయం సాధించిన తర్వాత ప్రేక్షకులు బాహుబలి-3 కూడా ఉంటే బావుందని కోరుకుంటారన్నారు. 
 
దీనిపై రాజమౌళి స్పందిస్తూ ప్రస్తుతం తన వద్ద 'బాహుబలి 3' కథ లేదన్నారు. అందువల్ల బాహుబ‌లి-3 ఉంటుందో లేదో తాను ఇప్పుడే చెప్పలేనని స్పష్టంచేశారు. తన తండ్రి విజేంద్రప్రసాద్ తనకు నచ్చేవిధంగా సీక్వెల్ కథ సిద్ధం చేస్తే బాహుబలి 3 తప్పకుండా తీస్తామని రాజామౌళి హామీ ఇచ్చాడు. బాహుబలి-3 ఉంటుందో? లేదో? తనకు తెలియనపుడు ఉంటుందని ప్రకటించడం ప్రేక్షకులను మోసం చేసినట్లే అవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు.