శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (15:39 IST)

రాజమౌళి తదుపరి ప్రాజెక్టుపై చర్చ... అడ్వాన్స్ తీసుకున్న జక్కన్న.. హీరో ఎవరు?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి చిత్రం తీసేందుకు కమిట్ అయ్యారు. ఇందుకోసం ఓ ప్రముఖ నిర్మాత నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాజమౌళి తదుపరి ప్రాజెక్టులో న

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి చిత్రం తీసేందుకు కమిట్ అయ్యారు. ఇందుకోసం ఓ ప్రముఖ నిర్మాత నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాజమౌళి తదుపరి ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కొట్టేసిన లక్కీ హీరో ఎవరంటే.. అల్లు అర్జున్. 
 
ప్రస్తుతం 'దువ్వాడ జగన్నాథం'లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తవ్వక ముందే మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లాలనే కసితో ఈ అల్లు హీరో ఉన్నాడు. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా షూటింగ్‌లో నిమగ్నమైవున్నాడు. 
 
వరుస చిత్రాలు చేస్తూ తన రేంజ్‌ని మరింతగా పెంచుకోవాలని బన్నీ చూస్తున్నాడు. అనుకోని విధంగా కలసి వచ్చిని ఈ ఆఫర్ నిజమైతే బన్నీ రేంజ్ మామూలుగా ఉండదు.... బన్నీలోని నటుడుని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే అవకాశం రాజమౌళి రూపంలో ఎదురువుతోంది... 'బాహుబలి' తర్వాత జక్కన్న తీయబోయే ఫిల్మ్‌లో బన్నీనే హీరో అని వినిపిస్తోంది. 
 
ఈ చిత్రానికి నిర్మాత డీవీవీ దానయ్య. బాహుబలికి ముందు డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో రాజమౌళి ఓ సినిమా తీయాలనుకున్నాడు. అది కార్యరూపం దాల్చలేదు. అయితే, అప్పట్లో ఈ చిత్రానికి అడ్వాన్స్ కూడా పుచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు అదే చిత్రాన్ని తెరెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. 
 
మరోవైపు అల్లు అర్జున్‌కి కూడా అడ్వాన్స్ ఇచ్చిన దానయ్య వీరిద్దరి కలయికలో సినిమా తీయాలనుకుంటున్నాడట... బన్నీ 'డీజే' షూటింగ్ కంప్లీట్ చేయగానే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళుతుందంటున్నారు. మరి రాజమౌళి, బన్నీకాంబినేషన్‌లో సినిమా ఉంటుందా లేదా అన్నది వేచిచూడాల్సివుంది. ఈ వార్త నిజమైతే రాజమౌళి విదేశీ టూర్ ముగించుకుని వచ్చాక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.