శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 7 నవంబరు 2017 (13:07 IST)

రాజశేఖర్ ఆనందాన్ని ఆవిరి చేసేసిన పెద్దకుమార్తె...

నటుడు రాజశేఖర్ చాలారోజుల తర్వాత వచ్చిన సూపర్ హిట్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవ్వాల్సిన పరిస్థితి కాస్తా రివర్స్ అయ్యింది. ఆయన నటించిన చిత్రం గరుడవేగ విడుదలకు కొద్దిరోజుల ముందు ఆయన తల్లిగారు మరణించారు. దాన్ని మర్చిపోకముందే జీవిత సోదరుడు, గరుడవేగ చిత్రానికి

నటుడు రాజశేఖర్ చాలారోజుల తర్వాత వచ్చిన సూపర్ హిట్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవ్వాల్సిన పరిస్థితి కాస్తా రివర్స్ అయ్యింది. ఆయన నటించిన చిత్రం గరుడవేగ విడుదలకు కొద్దిరోజుల ముందు ఆయన తల్లిగారు మరణించారు. దాన్ని మర్చిపోకముందే జీవిత సోదరుడు, గరుడవేగ చిత్రానికి ఆన్‌లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన మురళి కన్నుమూశారు. సినిమా హిట్ ఆనందాన్ని చవిచూడాల్సిన రాజశేఖర్ దంపతులు శోకంలో మునిగాయి. 
 
ఇది చాలదన్నట్లు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ చేసిన కారు యాక్సిడెంటులో గాయాలు, ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ అది చాలా పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టిందంటున్నారు. స్పీడ్ బ్రేకర్ సరిగా చూసుకోకుండా వేగంగా కారును నడపడంతో అది అదుపుతప్పి మరో కారును ఢీకొట్టింది. 
 
ఈ కారు ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న మేనేజర్ అశోక్ కుమార్‌ది. తను ఇటీవలే కొత్త కారును కొనుగోలు చేశాననీ, తనకు నష్టపరిహారంగా రూ. 30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఐతే అంతమొత్తం చెల్లించేందుకు రాజశేఖర్ దంపతులు నిరాకరించడంతో అతడు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. ఇంకోవైపు శివానీకి డ్రైవింగ్ లైసెన్స్ లేదని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే రాజశేఖర్ కు ఇదీ మరీ ఇబ్బందికరంగా మారుతుంది.