ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (15:06 IST)

యాంకర్ సుమ అత్త నటి కన్నుమూత

సినీ నటుడు రాజీవ్ కనకాల తల్లి, బుల్లితెర యాంకర్ సుమ అత్త అయిన నటి లక్ష్మీదేవి శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు.

సినీ నటుడు రాజీవ్ కనకాల తల్లి, బుల్లితెర యాంకర్ సుమ అత్త అయిన నటి లక్ష్మీదేవి శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. యాక్టింగ్ స్కూల్ ద్వారా అనేకమందికి నటనలో ఓనమాలు దిద్దించిన లక్ష్మీదేవి 'మాస్టారు కాపురం', 'మాయలోడు' వంటి చిత్రాల్లో నటించారు. మొత్తం ఆరు చిత్రాల్లో నటించారు. 
 
తల్లి మృతిపై రాజీవ్ కనకాల స్పందిస్తూ, 'అమ్మది సంపూర్ణమైన జీవితం. నట శిక్షకురాలిగా ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. నటుడిగా, నటిగా చిత్రపరిశ్రమలో పేరు తెచ్చుకోవాలని ప్రయతించే ప్రతి ఒక్కరినీ తన కన్నబిడ్డలా చేరదీశారు. నిన్నటి (శుక్రవారం)వరకూ ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు' అని కన్నీటిపర్యంతో చెప్పుకొచ్చారు. 
 
యాంకర్ సుమ కూడా అత్తగారితో ఆమె అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనను కోడలిగా కాకుండా కన్నా కూతురిలా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. కాగా, లక్ష్మీదేవి అంత్యక్రియలు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరిగాయి.