గురువారం, 9 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 6 అక్టోబరు 2025 (14:43 IST)

రిషికేష్‌కు రజినీకాంత్, రోడ్డు పక్కన రాతి బెంచీపై ప్లేటులో భోజనం చేస్తూ...

Rajinikanth eating food on a plate at roadside
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కోసం హిమాలయాలకు వెళ్లారు. రజనీకాంత్ రిషికేశ్‌లోని స్వామి దయానంద ఆశ్రమాన్ని సందర్శించి స్వామి దయానందకు నివాళులర్పించారు. తలైవా రజినీకాంత్ గంగా నది ఒడ్డున ధ్యానం కూడా చేశాడని, గంగా ఆరతిలో కూడా పాల్గొన్నాడని తెలుస్తోంది. రజినీకాంత్ ఆధ్యాత్మిక విహారయాత్రకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
 
రజనీకాంత్ తెల్లటి దుస్తులు ధరించి రోడ్డు పక్కన రాతి బెంచీపై ఉంచిన డిస్పోజబుల్ ప్లేటులో వడ్డించిన ఆహారాన్ని తింటున్నట్లు కనిపించారు. ఆయనకు కొద్ది దూరంలో పార్క్ చేసిన కారు కనిపించింది. మరో ఫోటోలో సూపర్ స్టార్ రజినీ ఆశ్రమంలో ఉన్న కొంతమందితో మాట్లాడుతుండగా, ఆ తర్వాత మరికొందరితో కలిసి ఫోటోలు దిగినవి బయటకు వచ్చాయి.
 
కాగా ఇటీవల నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నిర్వహించిన తమిళగ వెట్రీ కజగం... టీవీకే పార్టీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులకు రజనీకాంత్ తన సంతాపాన్ని తెలిపారు.