మంగళవారం, 15 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2016 (14:24 IST)

రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నారా? పొన్‌రాజ్‌తో కబాలి భేటీ ఎందుకు..?

సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయాల్లో రానున్నట్లు తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సహాయకుడు పొన్‌రాజ్‌‌తో రజినీకాంత్ సమావేశం కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కలాం పేరుతో రాజకీయపార్టీని స్థాపించిన పొన్‌

సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయాల్లో రానున్నట్లు తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సహాయకుడు పొన్‌రాజ్‌‌తో రజినీకాంత్ సమావేశం కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కలాం పేరుతో రాజకీయపార్టీని స్థాపించిన పొన్‌రాజ్‌ రజినీకాంత్‌తో సమావేశం కావడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఈ భేటీలో రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై చర్చించినట్లు తెలిసింది. 
 
1996లో జీకే మూపనార్‌ ప్రారంభించిన తమిళ మానిల కాంగ్రెస్‌ (టీఎంసీ)తో డీఎంకే చేతులు కలిపింది. ఈ కూటమి తరుపున రజినీకాంత్ ప్రచారంలో పాల్గొనడంతో ఆ ఎన్నికల్లో ఆ కూటమి ఘనవిజయం సాధించింది. కాగా గతంలో బీజేపీ కూడా రజినీకాంత్‌కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. కానీ  రాజకీయాలపై దృష్టి పెట్టకుండా నటజీవితానికే పరిమితమయ్యారు. 
 
పార్లమెంట్, అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో రజినీ వాయిస్‌ కోసం పలు పార్టీలు ప్రయత్నించినప్పటికీ రజినీకాంత్ సైలెంట్‌గా ఉండిపోయారు. ఎలాగైనా రాజకీయాల్లోకి రావాలని అభిమానులు రజినీపై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చినా ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో కలాం సహాయకుడు పొన్‌రాజ్‌ కలాం పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించి ప్రజాదరణ పొందారు.