గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (17:19 IST)

తప్పు జరిగింది.. ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పిన 'రోబో 2.0' దర్శకుడు శంకర్

తమిళ దర్శకుడు శంకర్ ఓ ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా "రోబో 2.O" నిర్మితమవుతుంది. ఈ చిత్రం సెట్‌కు వచ్చిన ఓ ఫోటో జర్నలిస్టులపై చిత్ర యూనిట్‌కు చెందిన కొందరు దాడి చేయగా

తమిళ దర్శకుడు ఎస్.శంకర్ ఓ ఫోటో జర్నలిస్టులకు సారీ చెప్పారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా "రోబో 2.O" నిర్మితమవుతుంది. ఈ చిత్రం సెట్‌కు వచ్చిన ఓ ఫోటో జర్నలిస్టులపై చిత్ర యూనిట్‌కు చెందిన కొందరు దాడి చేయగా, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అసిస్టెంట్ డైరెక్టర్, మరో ఇరువురుని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు శంకర్ రంగంలోకి దిగారు. దాడి ఘటనపై విచారం వ్యక్తంచేశారు. క్షమాపణలు తెలియజేశారు. దాడి విషయం తనకు తెలియదని, అప్పుడు సెట్‌లో తాను లేనని చెప్పారు. అయితే జర్నలిస్టులపై దాడి జరక్కుండా ఉండాల్సిందని, జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని మీడియాకు హామీ ఇచ్చాడు.