శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (08:55 IST)

సిల్వర్ స్క్రీన్ రారాజుకు 45 యేళ్ళు - ఇండియన్ సినిమాకు ఐకాన్

తమిళ సిల్వర్ స్క్రీన్ రారాజుగా వెలుగొందుతున్న హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఈయన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 45 యేళ్లు పూర్తయ్యాయి. విశ్వనటుడు క‌మ‌ల్‌ హాస‌న్‌తో క‌లిసి 'అపూర్వ రాగంగ‌ల్' సినిమాతో ఇదే రోజు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టారు. ర‌జినీ 45 ఏండ్ల ప్ర‌స్థానాన్ని గుర్తు చేస్తూ కామ‌న్ డీపీని.. సినీ స్టార్లు షేర్ చేసుకున్నారు.
 
నిజానికి తమిళ వెండితెరపైనే కాదు.. భారతీయ సినీ వెండితెరపై రజనీకాంత్ కనిపిస్తే అభిమానుల‌కు పండ‌గే. ఆయ‌న న‌డక‌కు, స్టైల్‌కు ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఫ్యాన్స్ ఫిదా అయిపోవాల్సిందే. డైలాగ్ చెప్తున్నాడంటే థియేట‌ర్ల‌లో ఈల‌లు వేయాల్సిందే. అలాంటి నటుడు రజినీకాంత్‌కు ప్రేక్ష‌కులు పెట్టిన పేరు తలైవా. 
 
ఈ సూప‌ర్ స్టార్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 45 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో ప్రశంసలు, అభినందల వర్షం కురుస్తోంది. సినీ సెలెబ్రిటీలు కూడా అభినందనలు తెలుపుతున్నారు. మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్.. ర‌జ‌నీ కెరీర్‌లో చేసిన పాత్ర‌ల‌తో కూడిన పోస్ట‌ర్‌ను షేర్ చేస్తూ.. 5 ద‌శాబ్దాలు.. 45 సంవ‌త్స‌రాలు.. భార‌త సినిమాకు ఐకాన్‌, ఐడెంటిటీ. 
 
త‌న న‌ట‌నతో భార‌త సినీ ప‌రిశ్ర‌మ గొప్ప‌ద‌నాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పిన ర‌జ‌నీ సార్‌కు శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేశారు. మ‌రో న‌టుడు పృథ్విరాజ్ సుకుమార‌న్.. త‌మిళ‌, భార‌తీయ సినిమా ఐకాన్ ర‌‌జనీకాంత్ సార్‌కు విషెస్ తెలియ‌జేస్తూ ట్వీట్ చేశాడు.