శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : బుధవారం, 29 మే 2019 (18:24 IST)

లవ్ మ్యారేజ్.. త్వరలోనే చెప్తా: రాజ్ తరుణ్

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన యంగ్ హీరో రాజ్ తరుణ్. గోదావరి ప్రాంతంలో నివసించే కుర్రాడిగా ఆ స్లాంగ్‌లో మాట్లాడుతూ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.


ఆ తరువాత వరుసగా చాలా సినిమాలు చేసినప్పటికీ కెరీర్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. నటనాపరంగా రెండు మూడు సినిమాలలో మంచి మార్కులే పడినప్పటికీ రాజ్ తరుణ్‌ మార్కెట్ మాత్రం అంతగా పెరగలేదు. 
 
గత ఏడాది మూడు సినిమాలు ‘రంగుల రాట్నం’, ‘రాజు గాడు’, ‘లవర్’ చేసినప్పటికీ అన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో రాజ్ తరుణ్ రేసులో బాగా వెనకబడిపోయాడు.

అయినా కూడా రాజ్ తరుణ్‌కు మరో అవకాశం తలుపుతట్టింది. శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాతగా ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమాలో ప్రస్తుతం రాజు తరుణ్ నటిస్తున్నాడు. 
 
సోషల్ మీడియాలో ఆయన రెండు రోజుల క్రితం ‘ఆస్క్ రాజ్’ పేరుతో ట్విట్టర్‌లో అభిమానులతో చాట్ చేసారు. ఆ సందర్భంగా అభిమానులు చాలా ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి.

‘మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా?’ అని ఒక అభిమాని అడిగితే, ‘ప్రేమ వివాహం’ అని చెప్పారు. 
 
దానికి ప్రతిగా ‘లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు.. మరి మా రాణి ఎవరో మాకు ఎప్పుడు చెప్తారు?’ అని మరో అభిమాని ప్రశ్నించగా.. దీనికి రాజ్ ‘అతి త్వరలో’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక త్వరలో పెళ్లి భాజాలు మోగుతాయేమో చూడాలి.