శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (12:46 IST)

ఎడముఖం .. పెడముఖంగా రకుల్ - సాయిపల్లవి...

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం "ఎన్.జి.కె" (నందా గోపాల కృష్ణ). ఈ నెల 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారిలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ కాగా, మరొకరు సాయిపల్లవి. కానీ, ఇందులో పాయి పల్లవి పాత్రకే అధిక ప్రాధాన్యత ఉందట. అందుకే చిత్ర యూనిట్ కూడా షూటింగ్ లోకేషన్లలో ఆమెకే అధిక ఇంపార్టెన్స్ ఇచ్చారట. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. పైగా, లొకేషన్లలో వీరిద్దరు కూడా పెద్దగా మాట్లాడుకున్న దాఖలాలు కూడా లేవట. 
 
ఈ నేపథ్యంలో 'ఎన్.జి.కె' ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్లు పాల్గొన్నారు. అపుడు వేదికపై అశీనులైన సాయి - రకుల్‌లు ఎడముఖం పెడముఖంగా ఉంటూ ముభావంగా ఉన్నారట. మీడియా ముందు వేదికపై వీరిద్దరి ప్రవర్తన చూసిన చిత్ర యూనిట్ అవాక్కయ్యారట.