గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 4 జులై 2017 (06:18 IST)

రకుల్ హస్తవాసి బాగుందా? ‘దర్శకుడు’ సాంగ్ లాంచ్ చేయించారు

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న దర్శకుడు సుకుమార్‌. ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘కుమారి 21 ఎఫ్‌’. ఈ చిత్రం చక్కటి విజయం సాధించింది. ఇప్పుడు సుకుమార్‌ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. అశోక్‌, ఈషా జ

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న దర్శకుడు సుకుమార్‌. ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘కుమారి 21 ఎఫ్‌’. ఈ చిత్రం చక్కటి విజయం సాధించింది. ఇప్పుడు సుకుమార్‌ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. అశోక్‌, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్‌ జక్కా దర్శకుడు. ఈ చిత్రంలోని ‘ఆకాశం దించి మేఘాల్లో సెట్‌ వేస్తా..’ అనే పాటను సోమవారం ప్రముఖ కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ సుకుమార్‌ ఆలోచనలన్నీ వినూత్నంగా ఉంటాయన్నారు. ఆయన నిర్మాతగా రూపొందిస్తున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. త్వరలోనే మిగిలిన పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
 
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. త్వరలోనే మిగతా పాటలను కూడా ఒక్కొక్కటి విడుదల చేసి ఆ తర్వాత పూర్తి ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అశోక్ నటన, హరి ప్రసాద్ జక్కా దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాతలు తెలిపారు. 
 
అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.