గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (13:05 IST)

మేమిద్దరం చాలా క్లోజ్.. కానీ, ఆ రిలేషన్ లేదు: రకుల్ ప్రీత్

హీరో దగ్గుబాటి రానాతో తనకున్న సంబంధంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. తామిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని, కానీ తామిద్దరి మధ్య డేటింగ్ రిలేషన్ లేదని చెప్పుకొచ్చింది.

హీరో దగ్గుబాటి రానాతో తనకున్న సంబంధంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. తామిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని, కానీ తామిద్దరి మధ్య డేటింగ్ రిలేషన్ లేదని చెప్పుకొచ్చింది. తాజాగా కోలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన 'ధీరన్‌ అధిగారం ఒండ్రు' మంచి విజయాన్ని నమోదు చేసింది. అలాగే 'బాహుబలి', 'నాన్‌ ఆనైయిట్టాల్‌' సినిమాలతో రానా కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కోలీవుడ్ సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 
 
దీనిపై రకుల్ పైవిధంగా స్పందించారు. రానా, తాను మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. తామంతా కలిసి మొత్తం 20 మంది స్నేహితులమని తెలిపింది. తమ 20 మందిలో పెళ్లైన వారితో పాటు పెళ్లికాని వారు కూడా ఉన్నారని తెలిపింది. తాము తరచూ కలుసుకుని సరదాగా ఎంజాయ్ చేస్తుంటామని అందువల్లే తమపై అలాంటి రూమర్స్ వచ్చాయని వివరణ ఇచ్చింది.