విశాల్‌తో రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు సినిమానా? తమిళ సినిమానా?
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ మధ్య తెలుగులో పలు చిత్రాల్లో బిజీగా వుంది. అగ్రహీరోలతో వచ్చిన అవకాశాలను చేసేస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌లో కూడా సెటిల్ అయింది. తను ఓ జిమ్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక్కడకు పలువురు హీరోలు, హీరోయిన్లు.. టెక్నీషియన్లు కూడా వస్తుంటారు. ఇదే తనకు అందరినీ కలుసుకునే ప్లేస్‌గా రకుల్‌కు కలిసి వచ్చింది.
ఈ ఐడియా.. ఎవరు ఇచ్చారో కానీ.. ఆమెకు బాగా లాభించింది. నటుడు విశాల్ కూడా.. హైదరాబాద్ వస్తే.. ఆ జిమ్‌కు వెళ్ళి వస్తుంటాడట. ఎట్టకేలకు.. రకుల్ ప్రీత్ సింగ్... విశాల్‌తో నటించేందుకు అవకాశం కొట్టేసింది. ఈ విషయాన్ని విశాల్ ప్రకటించాడు. తనతో ఓ సినిమా చేస్తున్నా. అది తెలుగు సినిమానా, తమిళ సినిమా అనేది త్వరలో వెల్లడిస్తానన్నారు.