మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (16:47 IST)

రకుల్ ప్రీత్ సింగ్‌కు దురుసెక్కువే.. కామెంట్ చేస్తే తాట తీస్తుందట.. రాయితో కొట్టి?

ప్రస్తుతం టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కన్నడలో 'గిల్లి' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. వరుస అవకాశాలతో దూసుకెళుతున్న హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చే పేరు రకుల్ ప్రీత్ సింగ్.

ప్రస్తుతం టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కన్నడలో 'గిల్లి' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. వరుస అవకాశాలతో దూసుకెళుతున్న హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చే పేరు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ పరిశ్రమలో అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. రకుల్ దక్కించుకుంటున్న సినిమాలన్నీ దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలవే కావడం విశేషం. 
 
అరడజను ప్రాజెక్టుల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అందం, అభినయం, తనదైన గడుసుదనంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న''ధృవ'' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్‌ తన చిన్ననాటి విషయాలను మీడియాతో పంచుకుంది.
 
''చిన్నప్పుడు రకుల్ టామ్‌బాయ్‌లా ఉండేదట. మగవాళ్లతో సమానంగా తిరిగేదట. తననెవరైనా ఏడిపిస్తే వారి అంతుచూస్తుందట. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి రకుల్ నైనిటాల్‌ టూర్‌కి వెళ్లిందట. ఆ టూర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పోకిరి.. ఈ భామని ఫోటో తీశాడట. కోపంతో ఊగిపోయిన రకుల్ వెళ్లి అతని కాలర్‌ పట్టుకుని గట్టిగా ఒకటి పీకి, వాడి ఫోన్‌ పగలగొట్టేసిందట. 
 
అంతేకాదు వాడిని గట్టిగా పట్టుకుని పోలీసులకు ఫోన్‌ చేయమని ఫ్రెండ్స్‌కు చెప్పడంతో... ఆ పోకిరి రకుల్ కడుపు మీద గట్టిగా కొట్టేసి పారిపోయాడట. అయినా రకుల్ వదలకుండా... వెనకే పరుగెత్తి అతడిని రాయితో కొట్టిందట. ఎవరైనా నన్ను కామెంట్‌ చేస్తే తాట తీసేదాన్ననని రకుల్‌ తన చిన్ననాటి విషయాలను గుర్తుతెచ్చుకుంది.