1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ram Charan cuts cake during the shooting of Night Peddi

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Ram Charan cuts the cake-  Venkata Satish Kilaru, Janhvi Kapoor, Buchi Babu Sana
Ram Charan cuts the cake- Venkata Satish Kilaru, Janhvi Kapoor, Buchi Babu Sana
ప్రస్తుతం రామ్ చరణ్ తాజా సినిమా పెద్ది. (పెద్దిరెడ్డి అసలు పేరు) గత కొద్దిరోజులుగా చరణ్ రాత్రి పూట షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను హైదరాబాద్ శివార్లో వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నారు. చిన్న రాత్రి పెద్ది సెట్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు. చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు పుట్టినరోజు వేడుక ను చేసుకున్నారు. జాన్వీకపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా పరిమిత సభ్యులతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
 
రాత్రి పూ కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఇటీవలే చిత్రీకరించారు. పెద్ది కథ క్రీడా నేపథ్యం గనుక కొన్ని కీలక సన్నివేశాలు చిత్రించినట్లు తెలిసింది. ఇంతకుముందు నాలుగు జట్ల నేపథ్యంలో క్రికెట్ క్రీడను తెరకెక్కించారు. ఇందులో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు నటిస్తున్నారు. ఇటీవలే శివరాజ్ కుమార్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఆయన ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, చరణ్ కాంబినేషన్ రంగస్థలం హిట్ గురించి తెలిసిందే.
 
ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్ లో విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ బేనర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేల్ సినిమాటోగ్రఫీసమకూరుస్తున్నారు.
తర్వాతి కథనం
Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్