Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్
Ram Charan, Janhvi Kapoor
తెలుగు సినిమా ప్రేక్షకులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు క్రేజీ న్యూస్ గా జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తయారైంది. కాలాతీత సోషియో-ఫాంటసీ క్లాసిక్ జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9 నుండి ప్రత్యేకంగా 4K 2D మరియు 3D ఫార్మాట్లలో విడుదలై 35వ వార్షికోత్సవం సందర్భంగా థియేటర్లలోకి తిరిగి వస్తుంది. ఈ చిత్రం దాని ఇతిహాస దృశ్యాలు, ఆకర్షణీయమైన కథాంశం మరియు సంచలనాత్మక సంగీతం కోసం తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. దీని గురించి మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ విషయాన్ని వెల్లడించారు.
"రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ ఈ సీక్వెల్ కి పర్ఫెక్ట్ గా ఉంటారు": మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి "మాజికల్ రీయూనియన్" గురించి వెల్లడించారు. గతంలోనే ఈ సినిమాను తీయాలనుందని నిర్మాత అశ్వనీదత్ చిట్ చాట్ లో వెల్లడించారు. ఆ సినిమాకు ఇప్పటి తరానికి తగినట్లు తీయాలంటే నా అల్లుడు నాగ్ అశ్విన్ అయితే బాగుంటుందని మా అమ్మాయిలు ఓ సందర్భంలో చెప్పారని తెలిపారు. ఇది జరిగి చాలా కాలం అయింది. ఆ తర్వాత కల్కి సినిమా కూడా విడుదలైంది. ఇప్పుడు జగదేకవీరుడు.. రి రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి అనేది ఓ డ్రీమ్ టీం. చిరంజీవి గారు, శ్రీదేవీ గారు, అశ్వనీదత్ గారు, రాఘవేంద్రరావు గారు, ఇళయారా గారు, విన్సెంట్ గారు, యండమూరి గారు ఇలా మహామహులంతా కలిసి ఈ మూవీని చేశారు. మళ్లీ ఇలాంటి ఓ టీం కలిసి ఇలాంటి ఓ క్లాసిక్ మూవీని తీయలేదు. ఇకపై తీయలేరు కూడా. మా జనరేషన్‌కు డ్రీమ్ టీం అంటే ఇదే. ఇక ఈ చిత్రంలో చివర్లో చూపించిన రింగ్ ఏమైంది? ఆ చేప ఎక్కడుంది? ఇలాంటి ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలి. ఇది రిక్వెస్ట్ కాదు.. ఇది మా డిమాండ్ అని అన్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. అప్పుడు ఆ సినిమాకు 21 మంది ఉద్దండులైన రచయితలు పనిచేశారు. ఈ సినిమాకూ ఇప్పుడు ఫేమస్ అయిన బుర్రాసాయిమాధవ్, రామ జోగయ్యశాస్త్రి, చంద్రబోస్ తోపాటు పలువురు పనిచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, జాన్వీకపూర్ మాత్రమే సీక్వెల్ కు సూటవుతారని ఈ సందర్భంగా వారు కూడా చెప్పడం విశేషం.
ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్. తర్వాత మరో హిట్ కోసం చూసిన రామ్ చరణ్ కు గేమ్ ఛేంజర్ నిరాశమిగిల్చింది. దానితో పెద్ది అనే సినిమాను బుజ్జిబాబు సనా దర్శకత్వంలో చేస్తున్నారు. త్వరలో షూటింగ్ పూర్తికానుంది. చరణ్ కు అంతకుమించి హిట్ కావాాలంటే జగదేకవీరుడు.. సీక్వెల్ రావాల్సిందేనంటూ ఇటీవలే ఆయన అభిమానులుకూడా ట్వీట్ చేయడం విశేషం.