గురువారం, 9 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 అక్టోబరు 2025 (14:03 IST)

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

upasana - ram charan
తమ కుమార్తె ముఖాన్ని బాహ్య ప్రపంచానికి చూపించకపోవడానికి ఒక కారణం ఉందని సినీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అంటున్నారు. రామ్ చరణ్ - ఉపాసనల గారాలపట్టి క్లీన్‌కారా. ఆ చిన్నారి ముఖాన్ని ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి చూపించలేదు. దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కారణాన్ని ఉపాసన తాజాగా ఓ కార్యక్రమంలో వెల్లడించారు. తాము ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
"ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. ఎపుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా నన్ను, రామ్ చరణ్‌ను చాలా భయపెట్టాయి. అందుకే మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. విమానాశ్రయానికి వెళ్లినపుడు కూడా పాప ముఖానికి మాస్క్ వేయడం తమకు పెద్ద పనే అయినా అది అవసరమని భావిస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు. 
 
"మేము చేస్తున్నది సరైన పనేనా? కాదా? అన్నది మాకు తెలియదు. కానీ పాప ముఖాన్ని దాస్తున్న విషయంలో మాత్రం నేను, నా భర్త చరణ్ సంతోషంగానే ఉన్నాం. ఇప్పట్లో అయితే, క్లీన్‌కారా ముఖాన్ని చూపించాలని అనుకోవడం లేదు" అని స్పష్టం చేశారు. 
 
రామ్ చరణ్ - ఉపాసనల వివాహం గత 2012లో జరిగింది. వీరికి 2023లో జూన్ 20వ తేదీన ఓ పాప జన్మించగా, ఆమెకు క్లీన్‌కారా అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నారు. పాప పుట్టినప్పటి నుంచి ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నప్పటికీ పాప ముఖాన్ని మాత్రం బాహ్య ప్రపంచానికి మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.