గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (08:53 IST)

'రౌడీ నం.150'గా వస్తా... దేవుడు చిరంజీవి కుటుంబాన్ని రక్షించుగాక... : వర్మ తాజా ట్వీట్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోమారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. త్వరలోనే రౌడీ నంబర్ 150గా వస్తానని ప్రకటిస్తూనే.. మెగా ఫ్యామిలీని ఆ దేవుడు రక్షించుకాగ అంటూ దీవిస్తూ తాజాగా ట్వ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోమారు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. త్వరలోనే రౌడీ నంబర్ 150గా వస్తానని ప్రకటిస్తూనే.. మెగా ఫ్యామిలీని ఆ దేవుడు రక్షించుకాగ అంటూ దీవిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. 
 
ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ వేదికగా రామ్ గోపాల్ వర్మపై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. వీటికి వర్మ గత మూడు రోజులుగా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. భగవద్గీతను, డామన్‌ వెయాన్స్‌, ఫ్రాంక్లిన్‌ ఫోర్‌ల కొటేషన్లను పేర్కొంటూ.. తన ఫీల్ ఏమిటో చూపించాడు. 'అద్దాల మేడలో ఉండే వాళ్లు ఇతరులపై రాళ్లు వేయకూడదు-భగవద్గీత' అంటూనే.. డామన్‌ వెయాన్స్‌, ఫ్రాంక్లిన్‌ ఫోర్‌ల సందేశాలను గుర్తు చేస్తూ తనదైనశైలిలో రెచ్చిపోయాడు. 
 
వీటితోపాటు 'రౌడీ నంబర్‌ 150' అంటూ స్టీల్‌ గ్లాస్‌ను కంటికి అడ్డంగా పెట్టుకుని దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. 'చిరంజీవిగారి అభిమానులకు నా క్షమాపణలు. అందుకు కారణం నాగబాబు. ఆయన తరపున కూడా నేనే క్షమాపణలు చెబుతున్నా. దేవుడు చిరంజీవిగారి కుటుంబానికి ఎన్నో పాజిటివ్స్ ఇచ్చాడు. పవన్‌, చరణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌, బన్నీ వాటన్నింటినీ నాగబాబుగారితో బ్యాలెన్స్‌ చేశాడు' అంటూ మరో ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.