బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 ఏప్రియల్ 2018 (17:25 IST)

"ఆఫీసర్" నాగార్జున గుమ్మడికాయ కొట్టేశారు...

టాలీవుడ్ 'కింగ్' నాగార్జున హీరోగా నటిస్తున్న "ఆఫీసర్". రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముగిసింది. 'ఆఫీసర్' చిత్రం షూటింగ్ పూర్తయింది. గుమ్మడి కాయకొట్టేశాం. చిత్ర యూనిట్‌కు ధన్యవ

టాలీవుడ్ 'కింగ్' నాగార్జున హీరోగా నటిస్తున్న "ఆఫీసర్". రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముగిసింది. 'ఆఫీసర్' చిత్రం షూటింగ్ పూర్తయింది. గుమ్మడి కాయకొట్టేశాం. చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
ఇకపోతే, నాగార్జున - రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో 24 యేళ్ళ తర్వాత రానున్న చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో శివ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. కాగా, ఈ చిత్రంలో నాగార్జున పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. 
 
హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి అక్కడ ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసాఫీసర్‌గా ఈ చిత్రంలో నాగార్జున కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నాగ్‌కు జోడీగా మైరా సరీన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 'ఆఫీసర్' మే 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుదీర్ఘ కాలం తర్వాత నాగ్-వర్మ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.