బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 17 మే 2016 (17:45 IST)

చిరు కంటే కొడుకు సినిమానే ముందు...

చిరంజీవి 150వ సినిమా నిర్మాతగా రామ్‌చరణ్‌ వున్నాడు. ఆ చిత్రం కోసం రకరకాల కసరత్తులు జరుగుతున్నాయి. అయితే కొంత ఆలస్యమవుతుండటంతో.. ఈలోగా రాంచరణ్‌ ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమై బాడీని డెవలప్‌ చేస్తున్నాడు. అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నిర్మిస

చిరంజీవి 150వ సినిమా నిర్మాతగా రామ్‌చరణ్‌ వున్నాడు. ఆ చిత్రం కోసం రకరకాల కసరత్తులు జరుగుతున్నాయి. అయితే కొంత ఆలస్యమవుతుండటంతో.. ఈలోగా రాంచరణ్‌ ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమై బాడీని డెవలప్‌ చేస్తున్నాడు. అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్న కొత్త చిత్రం ఈ నెల 22 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాంచరణ్‌ కొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు.
 
క్యారెక్టర్‌ పరంగా చరణ్‌ స్టన్నింగ్‌ లుక్‌‌తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. విభిన్నమైన కథాంశంతో రాంచరణ్‌, సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌ అనగానే అంచనాలు పెరిగాయి. హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్‌ పార్ట్‌ చిత్రీకరించనున్నారు. వచ్చే నెల 20 నుంచి కాశ్మీర్‌లో కీలకమైన షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన 'తని ఒరువన్‌' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌, అరవింద్‌ స్వామి కీలక పాత్రలు పోషించనున్నారు.