శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (14:43 IST)

'బుల్లి మెగాస్టార్'ను చూడాలనుంది... 20 ఏళ్ల ప్రాజెక్ట్ అంటున్న ఉపాసన

ఇది మామూలే. పెళ్లయ్యేవరకూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగేస్తుంటారు. ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోకపోతే ఇదే ప్రశ్న ప్రతి అబ్బాయికి అమ్మాయికి ఎదురవుతుంది. దీనితో ఈ ప్రశ్న వారికి చికాకు తెప్పిస్తుంది కొన్నిసార్లు. ఐతే ఎంత చికాకు పడినా పెళ్లి చేసుకున

ఇది మామూలే. పెళ్లయ్యేవరకూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగేస్తుంటారు. ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోకపోతే ఇదే ప్రశ్న ప్రతి అబ్బాయికి అమ్మాయికి ఎదురవుతుంది. దీనితో ఈ ప్రశ్న వారికి చికాకు తెప్పిస్తుంది కొన్నిసార్లు. ఐతే ఎంత చికాకు పడినా పెళ్లి చేసుకునేవరకూ ఓ పట్టాన వదిలిపెట్టవు ఈ ప్రశ్నలు. సర్లే... ఎలాగోలా పెళ్లి చేసుకుంటా ఆ తర్వాత ఓ సంవత్సరం ఆగి మళ్లీ ప్రశ్నించడం మొదలుపెడతారు. 
 
అదే... తాతకి మనవడిని ఎప్పుడు ఇస్తారూ అంటూ. ఇప్పుడిలాంటి ప్రశ్నలే రాంచరణ్-ఉపాసన దంపతులకు ఎదురవుతున్నాయి. దీనిపై ఉపాసన డైరెక్టుగా చెప్పేశారు. పిల్లల్ని కనడం అనేది 20 ఏళ్ల ప్రాజెక్ట్ అనీ, పిల్లల్ని ఎప్పుడు కనాలో తమ ఇద్దరికీ తెలుసుననీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎవరి వర్కులో వాళ్లు బిజీగా వున్నామనీ, ఐతే చరణ్ తనను చాలా చక్కగా చూసుకుంటారని వెల్లడించారు. 
 
ఐతే పిల్లలు 20 ఏళ్లు వచ్చేసరికి వారి తల్లిదండ్రులు గర్వంగా వుండేట్లు ఎదగాలని అన్నారు. కాబట్టి ఆ ప్రాజెక్టు ఎప్పుడు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటే తమకు బుల్లి మెగాస్టార్‌ను చూడాలని వుందని మెగా ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. లెటజ్ వెయిట్ అండ్ సీ.