శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2017 (13:52 IST)

త్రిష బుగ్గపై ముద్దు.. ఇలాంటి ఫోటోలు చాలానే ఉన్నాయి : రానా

చెన్నై చిన్నది త్రిష బుగ్గపై టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా గాఢంగా ముద్దుపెడుతున్నట్టు సోషల్ మీడియాలో లీకైన ఫోటోపై చిత్ర పరిశ్రమలో పెద్ద వివాదమే జరిగింది. సినీ గాయని సుచిత్ర తన ట్విట్టర్ ఖాతాద్వారా పలువ

చెన్నై చిన్నది త్రిష బుగ్గపై టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా గాఢంగా ముద్దుపెడుతున్నట్టు సోషల్ మీడియాలో లీకైన ఫోటోపై చిత్ర పరిశ్రమలో పెద్ద వివాదమే జరిగింది. సినీ గాయని సుచిత్ర తన ట్విట్టర్ ఖాతాద్వారా పలువురు సినీ సెలెబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను లీక్ చేసిన విషయం తెల్సిందే. వీరిలో టాలీవుడ్ హీరోలు రానాతో పాటు ధనుష్, శింబు, రానా, త్రిషా, హన్సిక, నయనతార, ఆండ్రియానా వంటి పలువురు ఉన్నారు. ఈ ఫోటోలు, వీడియోలు దక్షిణాది చలన చిత్ర పరిశ్రమనే షాక్‌కు గురి చేసింది. 
 
ఇందులో హీరోయిన్ త్రిషను హీరో రానా ముద్దాడుతున్న ఫొటో కూడా ఉంది. ఈ ఫొటోపై ఓ తాజా ఇంటర్వ్యూలో రానా స్పందించాడు. ఈ వివాదానికి కారణం మీడియానే అని... మీడియా చేసిన హంగామా వల్లే ఈ విషయం చాలా పెద్దదిగా మారిందన్నాడు. ఇలాంటి ఫొటోలు చాలానే ఉంటాయనీ, అయినా తాను అలాంటి పనులు చేస్తానంటే నమ్ముతారా? అంటూ రానా జోక్ చేశాడు.