1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 మే 2016 (11:00 IST)

శ్రీదివ్యతో ఆడుకున్న రానా.. శ్రీ దివ్య వుంటే సినిమా హిట్టేనన్న భల్లాలదేవ!

దగ్గుబాటి రానా.. హీరోయిన్లతో చాలా చనువుగా వుంటాడు. అవసరమైతే వారితో ఆడుకుంటాడు. సెటైర్లు, వెటకారపు మాటలతో ఎంటర్‌టైన్‌ చేస్తాడు. నటి శ్రీదివ్యతో తను అలాగే ప్రవర్తించాడు. శ్రీదివ్య గురించి రానా వ్యాఖ్యానిస్తూ.. ఇండస్ట్రీలో 30ఇయర్‌ అనేపదం వాడుతుంటారు.. అలాగే శ్రీదివ్య 25ఇయర్స్‌ ఇండస్ట్రీ.. తను సీనియర్‌.. దర్శకుడు ఎలా షాట్‌ పెట్టాలి. ఏ యాంగిల్‌లో షాట్‌ బాగా వస్తుంది. అన్ని యాంగిల్స్‌ బాగా తెలుసు ఆమెకు. ఆమెతో తమిళ్‌లో ఓ సినిమా కలిసి చేశాను. నాకు తను సీనియర్‌ అని తెలుసు. 
 
కానీ ఇప్పుడే 25 ఏళ్ళ సీనియర్‌ అని తెలిసింది. తను నాక్కూడా కొన్ని సజెన్స్‌ ఇచ్చింది. బహుశా.. విశాల్‌క్కూడా సలహాలు ఇచ్చివుంటుంది. శ్రీదివ్య వుంటే సినిమా హిట్టే.. అంటూ ఎంటర్‌టైన్‌ చేశాడు. విశాల్‌, శ్రీదివ్య... 'రాయుడు' పేరుతో వచ్చే తమిళచిత్రంలో నటించారు. ఈ సందర్భంగా ఆడియోలో వేడుకలో రానా కాసేపు శ్రీదివ్యతో చలోక్తులు వేస్తూ ఆటపట్టించాడు. అనంతరం కూడా ఆమెతో మాటలతో ఆడుకున్నాడు.