సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 జూన్ 2021 (11:42 IST)

సైకో కిల్లర్‌గా మారనున్న రాశీఖన్నా... ఎందుకని?

విభిన్నమైన కథలను ఎంచుకుని పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి కథానాయికలకు వెబ్‌ సినిమాలు మంచి వేదికలవుతున్నాయి. సమంత, తమన్నా వంటి అగ్ర నాయికలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ మీద సత్తాచాటడంతో మరికొంత మంది తారలు వారి మార్గాన్ని అనుసరిస్తున్నారు. 
 
తాజాగా పంజాబీ సుందరి రాశీఖన్నా డిజిటల్‌ వేదికపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి ఆమె ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. రాజేష్‌ దర్శకుడు. క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. 
 
ఇందులో రాశీఖన్నా సైకో హంతకురాలిగా కనిపించనుందట. విపరీత మనస్తత్వం కలిగిన యువతిగా ఆమె పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని చెబుతున్నారు. రాశీఖన్నా నటిస్తున్న రెండో వెబ్‌సిరీస్‌ ఇది. ‘రుద్ర’ సిరీస్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సిరీస్‌ ఓటీటీ వేదికపై తనకు మంచి గుర్తింపును తీసుకొస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.