గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (14:02 IST)

పెళ్లిని రద్దు చేసుకోవడానికి కారణం అదే.. రష్మిక (video)

గీత గోవీందం హీరోయిన్ వరుస హిట్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అగ్ర హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఆమె స్టార్ కాకముందు కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వారి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే, చివరకు పెళ్లి చేసుకోకుండానే వారిద్దరూ విడిపోయారు. దీనిపై రష్మిక మరోసారి క్లారిటీ ఇచ్చింది. రక్షిత్‌పై ప్రేమ పుట్టిన కారణంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నానని ఆమె తెలిపింది. 
 
అయితే, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే కారణంతో పెళ్లిని రెండేళ్లు వాయిదా వేసుకోవాలని అనుకున్నాం. రెండేళ్లు గడిచిన తర్వాత... సినిమా అవకాశాలు అధికం కావడంతో.. పెళ్లికి సమయం కేటాయించడం సాధ్యం కాలేదని రష్మిక వెల్లడించింది. పెళ్లి చేసుకుంటే నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్టవుతుందని తను భావించానని చెప్పింది. ఈ కారణంగానే తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్టు తెలిపింది.