మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (11:47 IST)

రామ్‌తో రష్మిక.. నేషనల్ క్రష్ రొమాన్స్ ఖాయమా?

"పుష్ప" చిత్రీకరణకు సిద్ధమవుతున్న యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతోందని టాక్ వస్తోంది. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టిన బోయపాటి శ్రీను సినిమాలో నటీనటులను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. 
 
అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఇప్పటికే రష్మికకు కథ చెప్పగా, ఆమె సూచనప్రాయంగా అంగీకారం తెలిపిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. 
 
నిజానికి రామ్ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆయన చేసిన అన్ని డబ్బింగ్ సినిమాలు కూడా హిందీలో మిలియన్ల కొద్దీ అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా మార్కెట్‌ను బేస్ చేసుకుని బోయపాటి శ్రీను ఈ సినిమా ప్లాన్ చేశారని, రష్మిక అయితే హిందీ ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది కాబట్టి ఆమెను తీసుకోవడమే బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం.