సోమవారం, 18 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (19:55 IST)

ఆడవాళ్లు మీకు జోహార్లు ఎలా వుందో తెలుసా!

Sharwanand, Rashmika
న‌టీనటులు: శర్వానంద్, రష్మిక మందన్న, ఖుష్బు, రాధిక శరత్‌కుమార్ మరియు ఊర్వశి తదిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం-  సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్, సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం : కిషోర్ తిరుమల
 
శర్వానంద్ హీరోగా, రష్మీక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. శ‌ర్వానంద్‌కు స‌రైన హిట్‌లేదు. పుష్ప‌తో ర‌ష్మిక క్ర‌ష్మిక‌గా పేరు తెచ్చుకుంది. ద‌ర్శ‌కుడు  కిషోర్ తిరుమల ఎప్ప‌టినుంచో శ‌ర్వాతో సినిమా తీయాల‌ని తీశాడు. త‌న కుంటుబంలోని ఆప్యాయ‌త‌లు, అనురాగాలు తెర‌మీద ఆవిష్క‌రించాన్నాడు. ఇదే అభిప్రాయాన్ని దేవీశ్రీ ప్ర‌సాద్ కూడా వ్య‌క్తం చేశాడు. మ‌రి ఇది అన్ని కుటుంబాల వారికి న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌కంగా చెప్పిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈరోజే విడుద‌లైన సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
చిరంజీవి (శర్వానంద్) అమ్మ రాధిక‌తోపాటు న‌లుగురు పిన్నిలుంటారు. అంద‌రికీ కూతుర్లు పుడ‌తారు. చిరంజీవి ఒక్క‌డే మ‌గ‌వాడు. అందుకే గారాభం చేస్తారు. పెద్ద‌య్యాక పెండ్లి చేసే విష‌యంలో అతి జాగ్ర‌త్త వ‌ల్ల అమ్మాయిలు తిర‌స్క‌రిస్తుంటారు. చిరంజీవి కళ్యాణమండపం నడుపుతూ ఉంటాడు. ఓ రోజు ఆటోలో ప్ర‌యాణిస్తున్న ఆద్య (రష్మీక మందన్న)ను ఓ సంఘ‌ట‌న‌నుంచి కాపాడ‌తాడు. త‌ర్వాత ఓ రోజు గుడిలో క‌లుస్తుంది. త‌న పెండ్లి గురించి ప్ర‌య‌త్నాల గురించి ఆమెతో చెబుతాడు. నిన్ను చేసుకోబోయేది అదృష్ట‌వంతురాలు అంటుంది. ఆ మాట చిరంజీవికి నిద్ర‌ప‌ట్ట‌నీయ‌దు. పిన్నిలంద‌రి స‌ల‌హాతో ఆద్య‌ను క‌లిసి విష‌యం చెబుతాడు. మా అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోదు. అమ్మ మాటే నా మాట అంటుంది. అస‌లు అమ్మ ఎవ‌రు? ఆమె ఎందుకు ఒప్పుకోదు? అనే కోణంలో పిన్నిలంతా క‌లిసి ఓ ప్లాన్ వేస్తారు. చిరంజీవి అప్ల‌యి చేస్తాడు. ఆ త‌ర్వాత ఏమ‌యింది? అనేది క‌థ‌.
 
ప్లస్ పాయింట్స్ :
హాయిగా ఫ్యామిలీతో క‌లిసి చూడ‌ద‌గ్గ సినిమా ఇది. 
- ప్రేమ కోసం ఎంత త‌పించిపోతాడో శ‌ర్వ‌పాత్ర చూపించాడు. 
- ర‌ష్మిక కాజువ‌ల్‌గా న‌టించింది.
- ఖుష్బు పాత్ర‌.
- డి.ఎస్‌.పి. సంగీతం, పాట‌లు
- కనిపించే సూర్యుడితో త‌న బాధ‌లు శ‌ర్వా చెప్పుకొనేవిధానం
- స‌త్య‌, వెన్నెల కిశోర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
 
మైన‌స్‌లు-
- పిన్నిల భ‌ర్త‌లు నామ్‌కేవాస్తేగా వుంటారు
- రవి శంక‌ర్ విల‌నిజం చివ‌ర్లో తేలిపోయే విధానం
- చిన్న‌త‌నంలో ఎలా వున్నారో పిన్నిలు శ‌ర్వాకు 36 ఏళ్ళు వ‌చ్చినా అలానే వుండ‌డం
- ఖుబ్బూ బేక్‌డ్రాప్ స్టోరీ లాజిక్‌గా అనిపించ‌దు
- కె. బాల‌చంద‌ర్ ఎప్పుడో ఇదే టైటిల్ సినిమా తీసి పెయిల్ కావ‌డం కిశోర్ ప్ర‌య‌త్నించ‌డం
- కోటీశ్వ‌రురాలైన ర‌ష్మిక ఎవ‌రినో ప్రేమించ‌డం, ఆ విష‌యం శ‌ర్వాముందు చెప్ప‌డం వంటివి అర్తం కావు.
- చిరంజీవి పేరు హీరో పెట్టుకోవ‌డ‌మేకాదు. ఏకంగా ఆయ‌న బెడ్‌రూమ్‌లో పెద్ద పోస్ట‌ర్ కూడా పెట్టుకోవ‌డం కాస్త ఎక్కువ అనిపిస్తుంది.
 
వారంరోజుల‌పాటు ప్రేమించిన అబ్బాయి సిద్దార్థ ఇంటికి జెనీలియా రావ‌డం వెరైటీ. ఈ సినిమాలో ర‌ష్మిక అమ్మ ఖుష్బూను మెప్పించ‌డం కోసం మూడు వారాలు పాటు ఆమె క‌ర్మాగారంలో ప‌నిచేయ‌డం. ఇలా ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డల‌తో ద‌ర్శ‌కుడు క‌థ రాసుకున్నాడు. ర‌చ‌యిత ద‌ర్శ‌కుడు అయితే డైలాగ్స్ ఎక్కువ వుంటాయి. ఇందులో అదే జ‌రిగింది. ఎవరి పాత్ర‌లు వారు బాగానే పోషించారు. కానీ అస‌లు థ్రెడ్‌లో కాస్త లోపం వుంది. దాంతో రిటీన్ సినిమాగా అనిపిస్తుంది. పైగా కథకు బలం పెంచలేని లవ్ అండ్ అవసరం లేని సీన్స్ ఎక్కువైపోయాయి
 
కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఖుష్బూ నటన చాలా బాగుంది. అలాగే మరో ప్రధాన పాత్రల్లో నటించిన రాధికా శరత్ కుమార్, ఊర్వశీ, ఝాన్సీ, కళ్యాణి, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, రజిత తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఫైన‌ల్‌గా రొటీన్ డ్రామాగా అనిపిస్తుంది. చాలామంది సీనియ‌ర్ న‌టీమ‌ణులు పెట్టామ‌ని గొప్ప‌గా చెప్పినా అందులో వారికి పెద్ద ప్రాధాన్య‌త వుండ‌దు.  ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా కొంత‌మందినైనా అల‌రిస్తుందేమో చూడాలి.