మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (11:46 IST)

'రామారావు ఆన్ డ్యూటీ' అంటున్న రవితేజ

హీరో రవితేజ కొత్త చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. రామారావు ఆన్ డ్యూటీ అనే పేరుతో కొత్త చిత్రం తెరకెక్కనుంది. శరత్ మండవ అనే కొత్త దర్శకుడికి రవితేజ ఛాన్స్ ఇవ్వగా, ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయింది. 
 
తాజాగా ఈ సినిమాకి 'రామారావు ఆన్ డ్యూటీ' అనే టైటిల్‌ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్‌ను వదిలారు. రవితేజ స్టైలీష్ లుక్ ఆసక్తిని పెంచేదిలా ఉంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో, రవితేజ జోడీగా దివ్యాన్ష కౌశిక్ కనిపించనుంది. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
 
నిజానికి దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఉధృతంగా ఉంది. దీంతో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. అయినప్పటికీ రవితేజ తన దూకుడును మాత్రం తగ్గించలేదు. మొదటి లాక్డౌన్ తర్వాత థియేటర్లకు వచ్చిన 'క్రాక్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. 
 
రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా అది నిలిచింది. ఆ సినిమాను గురించి ఇంకా అంతా మాట్లాడుకుంటూ ఉండగానే, రవితేజ 'ఖిలాడి' సినిమాను కూడా విడుదల వైపుకు నడిపిస్తున్నాడు. ఆ సినిమా అలా థియేటర్ల దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది. ఇపుడు రామారావు ఆన్ డ్యూటీ పేరుతో మరో చిత్రం తెరకెక్కిస్తున్నారు.