గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (14:11 IST)

రామారావు ఆన్ డ్యూటీ నుంచి రవితేజ నాలుగు షేడ్స్‌లో వున్న పోస్టర్ విడుదల

Rama Rao on Duty
మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. నేడు ఈ మూవీ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.  
 
రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో రవితేజ విభిన్న ఎమోషన్స్లో కనిపిస్తున్నారు. ఒకచోట ఫ్యామిలీతో కనిపిస్తుండగా..మరోచోట ఆఫీస్ పనుల్లో  బిజీగా ఉన్నట్టు.. ఇంకోదాంట్లో యాక్షన్లోకి దిగేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక మరో ఫోటోలో ట్రైన్ మంటల్లో కాలిపోతోండటం కూడా కనిపిస్తోంది. మొత్తానికి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషన్స్ ఉన్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
 
దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇంకా ముఖ్యమైన నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు.
 
శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్  పోస్టర్కు అద్బుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది.
 
నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తణికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు
 
సాంకేతిక బృందం
 
కథ, కథనం, మాటలు, దర్వకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీం వర్క్స్
సంగీతం: శ్యామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సీ
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్